Wednesday, October 28, 2026 02:38 PM
Wednesday, October 28, 2026 02:38 PM

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి అతిపెద్ద జాతీయ భద్రతా సదస్సుకు వేదిక కాబోతోంది. డిసెంబరు 4 నుంచి 6వ తేదీ వరకు 3 రోజుల పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల వార్షిక జాతీయ సదస్సును తిరుపతిలోని IISER ప్రాంగణంలో నిర్వహించేందుకు కేంద్ర హోం శాఖ ఓకే చెప్పింది. ఈ కీలక సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా వస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏపీలో మోదీ, అమిత్ షా ఒకే వేదికపైకి వస్తుండటంతో..రాజధాని అమరావతి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.

Also Read : మళ్లీ.. బొత్స వర్సెస్ కిమిడి..!

ఢిల్లీలోనే కాకుండా భద్రతా సమావేశాలను దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈసారి తిరుపతిని ఎంపిక చేశారు. ఈ మూడ్రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల DGPలు,IGPలతో పాటు IB, RAW,NIA, CBI, CRPF, BSF వంటి పారామిలిటరీ బలగాల అగ్రనేతలంతా హాజరవుతారు. పోలీస్ ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ, అమిత్ షాలు నేరుగా ముఖాముఖి మాట్లాడి క్షేత్రస్థాయి శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించనున్నారు.

ఈ సదస్సులో దేశ భద్రత, సరిహద్దుల రక్షణ, సైబర్ నేరాల కట్టడి, ఉగ్రవాదం, డ్రగ్స్ సరఫరా, మావోయిస్టుల కట్టడి వంటి అంశాలపై కీలక రోడ్‌మ్యాప్ తయారు చేస్తారు. నేరాలను అడ్డుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం, కొత్త నేర న్యాయ చట్టాల అమలు తీరుతెన్నులపై ముఖ్యంగా చర్చిస్తారు. అలాగే ప్రధాని మోదీ గతంలో చెప్పిన స్మార్ట్ పోలీసింగ్ ఏ మేరకు అమలువుతోందో నివేదికల ద్వారా సమీక్షించనున్నారు.

Also Read : 100% ఇథనాల్ కేంద్రం సంచలన నిర్ణయం..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర అగ్రనేతలు, దేశ భద్రతా యంత్రాంగమంతా తిరుపతికి వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తిరుపతి నగరంతో పాటు ఐసర్ పరిసరాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాల ఈ రాకతో ఏపీ రాజకీయ ప్రాధాన్యత పెరగడమే కాకుండా, రాబోయే రోజుల్లో అమరావతి స్థాయిలోనూ భద్రతా పరమైన అంశాలపై కీలక చర్చలు నడిచే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తుఫాన్‌ వేగంతో సహాయక...

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో...

ఏపీలో ఆ ప్రాంతాల్లో...

అర్నబ్ తుఫాను భీభత్సం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే...

అమిత్‌షాకు సీఎం చంద్రబాబు...

అర్నబ్ అతి తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్...

తీరం దాటిన అర్నబ్...

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ అతి తీవ్ర...

ఆ ఆస్తుల్లో నీకు...

వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన...

జగన్ అడ్డాలో కూటమి...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్...

పోల్స్