Thursday, October 8, 2026 02:47 PM
Thursday, October 8, 2026 02:47 PM

గాల్లోనే విమానంపై పడ్డ పిడుగు.. లక్నోలో ఏం జరిగింది..?

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు ఊహించని, గుండె ఆగిపోయేంత భయానక అనుభవం ఎదురైంది. పాట్నా నుండి లక్నోకు ప్రయాణికులతో బయలుదేరిన ఒక విమానంపై గాల్లో ఉండగానే ఒక్కసారిగా ప్రకృతి ప్రకోపించింది. భూమికి ఏకంగా 17,000 అడుగుల ఎత్తులో విమానం దూసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు వచ్చి పడింది. పిడుగు పడిన ధాటికి విమానం ముందు భాగం తీవ్రంగా పాడైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

Also Read : రాజకీయాల్లోకి యంగ్ హీరో శివకార్తికేయన్..?

గాల్లో ఉండగా విమానాన్ని పిడుగు తాకడంతో ఒక్కసారిగా లోపల ఉన్నవారంతా ప్రాణాలు చేతిలో పట్టుకుని అల్లాడిపోయారు. విమానం ఒక్కసారిగా ఊగిపోవడంతో చావు తమ కళ్లముందే కనిపించిందని, ప్రయాణికులంతా భయాందోళనలతో కేకలు వేశారని సమాచారం. అయితే, పైలట్లు అత్యంత అద్భుతమైన చాకచక్యంతో వ్యవహరించి, రెప్పపాటు కాలంలో ముంచుకొచ్చిన ఘోర ప్రమాదం నుండి విమానాన్ని లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు.

Also Read : పాపం వైసీపీ.. ఆ 70 నియోజకవర్గాల పరిస్థితి ఏమిటో..?

నిర్ణీత సమయం కంటే ముందే విమానం క్షేమంగా కిందకు దిగడంతో ప్రయాణికులంతా దేవుడికి దండం పెట్టుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అత్యంత ప్రమాదకరమైన ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ విచారణకు ఆదేశించింది. పిడుగుపాటుకు గురై దెబ్బతిన్న ఆ విమానాన్ని ప్రస్తుతానికి సర్వీసుల నుంచి నిలిపివేసి పూర్తి స్థాయి మరమ్మతులకు తరలించారు. ల్యాండింగ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా వాతావరణం అనుకూలించకపోవడం, వడగండ్ల వాన కురవడమే ఈ పెను ప్రమాదానికి కారణమని ఎయిర్‌లైన్స్ సంస్థ స్పష్టం చేసింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పిఠాపురంలో ఏం జరుగుతోంది..?...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత...

విజయనగరంలో వైసీపీ మెయిన్...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విజయనగరం...

ఇస్లాంపై డోనాల్డ్ ట్రంప్...

ఫ్రాన్స్‌లో విద్యా వసతులు, ఉపాధ్యాయుల కొరత...

అందరి దృష్టి అక్టోబర్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై...

పోల్స్