Wednesday, October 7, 2026 02:56 PM
Wednesday, October 7, 2026 02:56 PM

ఇస్లాంపై డోనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్..!

ఫ్రాన్స్‌లో విద్యా వసతులు, ఉపాధ్యాయుల కొరత వంటి అంశాలపై విద్యార్థులు పెద్ద ఎత్తున చేస్తోన్న ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనలు కేవలం పాఠశాలల సమస్యల వల్ల వచ్చినవి కావని, దేశంలో అదుపు తప్పిన వలసల వల్లే ఇదంతా జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ లో చేసిన ఒక పోస్ట్‌లో ట్రంప్ ఈ మేరకు సంచలన ఆరోపణలు చేశారు.

Also Read : చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక మెయిన్ రీజన్ ఇదేనా..?

ప్ర”స్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్నది మరేదో కాదు.. పూర్తిగా అదుపు తప్పిన వలసల ప్రభావమే. ఇది పాఠశాలల గురించిన సమస్య కాదు.. ఒకప్పుడు గొప్పగా వెలిగిన దేశాన్ని ఇస్లాం చేజిక్కించుకోవాలని చూడటమే” అంటూ ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ఫ్రాన్స్‌లో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమానికి, వలసలకు లేదా ఇస్లాంకు ఉన్న సంబంధంపై ఆయన ఎలాంటి స్పష్టమైన ఆధారాలు గానీ, వివరణలు గానీ ఇవ్వలేదు. వాస్తవానికి ఫ్రాన్స్‌లో సెప్టెంబర్ చివరి వారం నుండి వందలాది ఉన్నత పాఠశాలలను మూసివేస్తూ విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు.

Also Read : కళ తప్పిన అయోధ్య.. యూపీ ఎన్నికలపై ప్రభావం..!

తరగతి గదుల్లో రద్దీ, టీచర్ల కొరత, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమిని నిరసిస్తూ దాదాపు 2.5 లక్షల మంది ప్రదర్శనకారులు వీధుల్లోకి వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నిరసనలు హింసాత్మకంగా మారి, పోలీసులతో ఘర్షణలకు దారితీశాయి. యూరప్‌లో చోటుచేసుకుంటున్న సామాజిక సమస్యలకు అక్కడ పెరుగుతున్న వలసలే కారణమంటూ ట్రంప్ విమర్శిస్తున్నారు. యూరప్ తన సరిహద్దులను వెంటనే మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో వచ్చే నెలలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ అనుకూల వర్గాలు ఈ ఫ్రాన్స్ నిరసనల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వలసల విధానాలపై తీవ్ర స్థాయిలో ప్రచారం ముమ్మరం చేశాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

విజయనగరంలో వైసీపీ మెయిన్...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విజయనగరం...

అందరి దృష్టి అక్టోబర్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై...

నవంబర్ నుంచి పెన్షన్‌లో...

ఏపీలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్‌ తగ్గుతుందా..?...

మిషన్ 2027 వరల్డ్...

భారత క్రికెట్ జట్టులోకి దాదాపు నాలుగేళ్ల...

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో...

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

పోల్స్