Wednesday, October 7, 2026 04:15 AM
Wednesday, October 7, 2026 04:15 AM

కాళేశ్వరం పై సీబీఐ గురి.. టార్గెట్ కేసీఆర్..!

కాళేశ్వరం ఫైల్ మళ్లీ కదిలింది. ఏడాదిగా ప్రాథమిక పరిశీలనకే పరిమితమైన కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పుడు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే దిశగా కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలున్న అవకతవకలపై సీబీఐ ఉన్నతాధికారులు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, దాని న్యాయపరమైన పరిణామాలు. తదుపరి దర్యాప్తు కార్యాచరణపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. సీబీఐ న్యాయ నిపుణులు సైతం ఘోష్ నివేదికలోని అంశాలు, కోర్టు ఉత్తర్వులను పరిశీలించినట్లు సమాచారం.

Also Read : చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక మెయిన్ రీజన్ ఇదేనా..?

అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుల పాత్రపైనా సీబీఐ దృష్టి సారించినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. కాళేశ్వరం వ్యవహారంలో కీలక నిర్ణయాలు, ప్రాజెక్టు నిర్మాణం, నిధుల వినియోగం తదితర అంశాల్లో వారి పాత్రను దర్యాప్తులో పరిశీలించే అవకాశం ఉంది. అవసరమైతే కేసీఆర్, హరీశ్ రావులను ప్రశ్నించే దిశగా సీబీఐ ముందుకు వెళ్లవచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే వారిని విచారణకు పిలవడంపై ఇప్పటి వరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు. తదుపరి దర్యాప్తు కార్యాచరణపై సీబీఐ తీసుకునే నిర్ణయమే దీనిపై స్పష్టత ఇవ్వనుంది.

Also Read : ఏపీ ఎన్నికల పైనే ఎందుకింత అనుమానం..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్టీఎస్ఏ, విజిలెన్స్, ఘోష్ కమిషన్ ఇలా ఇప్పటికే పలు స్థాయిల్లో పరిశీలనలు జరిగాయి. కానీ సీబీఐ దర్యాప్తు పూర్తిస్థాయిలో ముందుకు సాగితే అవినీతి, ప్రజాధనం వినియోగం, నిర్ణయ ప్రక్రియ. నిర్మాణ నాణ్యత, కాంట్రాక్టు వ్యవహారాలు, అధికారుల బాధ్యత వంటి అంశాలు ఒకే దర్యాప్తు పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్లుగా వివిధ నివేదికలు, కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కుల మధ్య నిలిచిపోయినట్లుగా కనిపించిన కాళేశ్వరం ఫైల్ పై ఇప్పుడు సీబీఐ ఉన్నతస్థాయిలో మళ్లీ దృష్టి పెట్టడం ఈ కేసులో తదుపరి దశకు సంకేతంగా కనిపిస్తుంది. సీబీఐ తదుపరి అడుగు ఎటు? కేసీఆర్, హరీశ్ రావుల వరకు దర్యాప్తు వెళ్తుందా..? లేక ప్రాజెక్టు నిర్ణయ ప్రక్రియలోని అధికారులు, సంస్థల నుంచే దర్యాప్తు ప్రారంభమవుతుందా? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్