Saturday, October 3, 2026 06:11 PM
Saturday, October 3, 2026 06:11 PM

గంభీర్ కు గంగూలీ బిగ్ అలెర్ట్.. వరల్డ్ కప్ కోసమే..!

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా వచ్చే 2027లో జరగబోయే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ అధికారిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 అక్టోబర్ 2 నుండి నవంబర్ 21 వరకు జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్ విజేతగా నిలవాలంటే స్టార్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో ఉండటం అత్యంత కీలకమని గంగూలీ స్పష్టం చేశాడు. టీమిండియా బ్యాలెన్స్ సమతుల్యంగా ఉండాలన్నా, జట్టుకు లైనప్ కుదరాలన్నా పాండ్యా పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డాడు.

Also Read : ఫ్లైదుబాయ్ విమానం కూల్చే కుట్ర వెనుక ఇరాన్ హస్తం..?

గంగూలీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాబోయే వరల్డ్ కప్‌ నాటికి హార్దిక్ పాండ్యాను మ్యాచ్‌లకు సిద్ధంగా ఉంచడం, అతడి ఫిట్‌నెస్‌ను కాపాడటమే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఎదురయ్యే అతిపెద్ద ఆఫ్-ఫీల్డ్ సవాల్ అని పేర్కొన్నాడు. పాండ్యా తగినంత క్రికెట్ ఆడటం లేదని, ఒకవేళ అతను గాయపడితే ప్రత్యామ్నాయంగా నితీష్ కుమార్ రెడ్డిని సిద్ధం చేయాలని సూచించాడు. నితీష్‌ను సెకండ్ ఆప్షన్‌గా భావిస్తే అతడికి ఇప్పటి నుంచే అన్ని మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వాలన్నాడు.

Also Read : లిక్కర్ స్కామ్.. జగన్ అరెస్టు అంత వీజీ కాదేమో..!

సౌతాఫ్రికా పిచ్‌లపై పేస్ ఆల్‌రౌండర్ అవసరం చాలా ఉంటుందని, రవీంద్ర జడేజా మరో ఆప్షన్ అయినప్పటికీ టాప్-5 బ్యాటర్లలో ఎవరూ బౌలింగ్ చేయని కారణంగా హార్దిక్ లాంటి సీమింగ్ ఆల్‌రౌండర్ జట్టుకు శ్రీరామరక్ష అని దాదా చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ షెడ్యూల్‌పై స్పందిస్తూ.. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో కాకుండా ఆస్ట్రేలియాతో ప్రారంభించడం మంచి పరిణామమని గంగూలీ అన్నాడు. ప్రస్తుతం భారత్-పాక్ మ్యాచ్‌లలో పాత స్థాయి పోటీ కనిపించడం లేదని విమర్శించాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకల్ వార్.. రంగంలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను...

జగన్‌ చేతిలో 40...

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్యకు...

నాడు ISB, నల్సార్.....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో...

రచ్చ చేస్తున్న ఫామ్‌హౌస్...

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఫామ్ హౌస్...

మద్యం స్కామ్‌లో మరో...

గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన...

ఈడీ స్పీడ్ ను...

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి...

పోల్స్