Tuesday, September 22, 2026 07:49 PM
Tuesday, September 22, 2026 07:49 PM

జగన్‌కు ఊహించని షాక్ ఇస్తున్న లోకేష్..!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ పావులు కదుపుతున్నారు. రాజుకు ఎక్కడ బలం ఉంటుందో.. అక్కడే నష్టం కలిగించాలనే వ్యూహాన్ని సరిగ్గా పాటిస్తున్నారు నారా లోకేష్. వైఎస్ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. ఇప్పటి వరకు అక్కడ వేరే ఏ పార్టీ వాళ్లు గెలిచిన సందర్భాలు లేవు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం, కడప లోక్‌సభ స్థానం, కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి.. ఇవన్నీ వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే ఉన్నాయి. పులివెందుల నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత జగన్ మోహన్ రెడ్డి గెలుస్తున్నారు.

Also Read : తప్పు చేసి కొత్త డ్రామాకు తెరలేపిన జగన్‌..?

కడప పార్లమెంట్ నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిచారు. చివరికి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అవినాష్ పోటీ చేయగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కుమార్తె షర్మిలా పోటీ చేశారు. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. ఫలితం మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి వైపే నిలిచింది. పులివెందులలోనే కాకుండా.. కడప పార్లమెంట్ పరిధిలో, కడప జిల్లాలో కూడా వైఎస్ కుటుంబం అంటే భయమే ఎక్కువ అనే మాట పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. అందుకే అక్కడ వేరే వారికి అవకాశం ఇచ్చేందుకు ఓటర్లు వెనుకడుగు వేస్తారనేది వాస్తవం.

అందుకే శత్రువుకు ఎక్కడ బలం ఉందో.. అక్కడే దెబ్బ కొట్టాలనేది ఇప్పుడు లోకేష్ ప్లాన్. అందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కీలకమైన కడప జిల్లాలో తెలుగుదేశం జెండాను ఎగురవేస్తూ.. వైసీపీ అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొడుతున్నారు. ముందు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా రెడ్డప్పగారి మాధవి గెలిచారు. ఆ తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం గెలుచుకుంది. ఇక తాజాగా కడప జెడ్పీ స్థానంపై తెలుగుదేశం పార్టీ కన్నేసింది. అందుకోసం లోకేష్ చేస్తున్న వ్యూహరచన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Also Read : గులాబీ కోటలే రేవంత్ టార్గెట్..!

మాజీ మంత్రి, వైఎస్ జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య తర్వాత వైఎస్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తండ్రి హంతకుల కోసం వివేకా కుమార్తె డాక్టర్ సునీతా ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నారు. జగన్ పై ఇప్పటికే ప్రత్యక్ష ఆరోపణలు చేస్తున్నారు. దీంతో సునీతకు సానుభూతి కూడా వచ్చింది. అందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన లింగాల మండల జెడ్పీటీసీ స్థానం నుంచి డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి పోటీలో నిలపాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సునీతతో చర్చించినట్లు సమాచారం. జెడ్పీటీసీగా సునీత గెలిస్తే.. ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తామని సునీతకు లోకేష్ ఆఫర్ చెసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. కడప జెడ్పీటీసీ స్థానం తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరడం ఖాయమే. ఇప్పుడు జగన్‌ కోట బద్ధలయినట్లే అనేది విశ్లేషకుల మాట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

తప్పు చేసి కొత్త...

బెజవాడలో టీచర్లపై చేసిన దాడిని, తాము...

కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకుని...

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా...

గులాబీ కోటలే రేవంత్...

తెలంగాణ రాజకీయ రంగంలో ఇప్పుడు ఉత్కంఠ...

టీడీపీ కార్యకర్తలకు పవన్...

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న...

కళ్లెదుటే టీచర్లపై దాడి...

విజయవాడ నగరంలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్...

పోల్స్