Tuesday, September 22, 2026 07:51 PM
Tuesday, September 22, 2026 07:51 PM

కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే ఖర్మ లేదు..!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా, తనపై జరుగుతోన్న ప్రచారాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసారు. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ పత్రికను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించడంపై వస్తున్న విశ్లేషణలు పూర్తిగా నిరాధారమని, శుద్ధ అబద్ధమని కొట్టిపారేశారు. గిట్టని వాళ్లు చేస్తున్న పస లేని ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు.

Also Read  : కళ్లెదుటే టీచర్లపై దాడి జరుగుతుంటే నిఘా వ్యవస్థ ఏమైంది..?

తన సోదరుడు, వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డిని తాను చివరిసారిగా కలిసింది తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనేనని షర్మిల గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కలిసినా, అది కేవలం తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు. ఒక తల్లిగా అన్ని రాజకీయ పార్టీల అధినేతలను తన బిడ్డ పెళ్లికి రావాలని, దీవించాలని ఆహ్వానించడం సహజమని, ఇందులో ఎలాంటి కొత్తదనం గానీ, వింత గానీ లేవని ఆమె పేర్కొన్నారు. కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయాలు చేసుకొనే ఖర్మ వైఎస్సార్ బిడ్డగా తనకు లేదని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు.

Also Read : క్రికెట్ పిచ్ నుంచి పొలిటికల్ పిచ్‌పైకి స్టార్ క్రికెటర్..!

ఒక పవిత్రమైన శుభకార్యానికి, రాజకీయాలకు లింకులు పెట్టి, తన విశ్వసనీయతను, రాజకీయ ప్రామాణికతను, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు. తన బిడ్డ వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల వివాహ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ హాజరై, ఒక్కటి కాబోతున్న నవదంపతులకు హృదయపూర్వక ఆశీస్సులు అందించాలని ఆమె కోరారు. ఈ నెల 24న వీరి నిశ్చితార్థం, నవంబర్ 25న వివాహం జరగనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

తప్పు చేసి కొత్త...

బెజవాడలో టీచర్లపై చేసిన దాడిని, తాము...

గులాబీ కోటలే రేవంత్...

తెలంగాణ రాజకీయ రంగంలో ఇప్పుడు ఉత్కంఠ...

టీడీపీ కార్యకర్తలకు పవన్...

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న...

కళ్లెదుటే టీచర్లపై దాడి...

విజయవాడ నగరంలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్...

పోల్స్