Wednesday, September 16, 2026 06:01 PM
Wednesday, September 16, 2026 06:01 PM

జగన్ రెడ్డి కాదా.. వైసీపీ నేతలకు సాయిరెడ్డి సూటి ప్రశ్న..!

త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దూకుడు పెంచారు. ప్రధానంగా టార్గెట్ వైసీపీ అన్నట్లుగా విజయసాయిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ అంటే ఇప్పటి వరకు ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీగానే ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతీ రెడ్డి పేరు చివర్లో రెడ్డి అనే పేరు ఉండటంతో ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ అని భావిస్తున్నారు. అటు రెడ్డి సామాజిక వర్గం కూడా.. ఇది తమ సొంత పార్టీ అనే భావనలోనే ఉన్నారు.

Also Read : ఏపీలో ఉద్యోగాల జాతర.. మరో గుడ్ న్యూస్..!

వైఎస్ఆర్ కుటుంబం కన్వర్టెడ్ క్ట్రిస్టియన్ అనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అయితే హిందువుల నుంచి వ్యతిరేకత రాకుండా.. వైఎస్ కుటుంబం తొలి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ వైఎస్ కుటుంబంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇప్పటి వరకు సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదు. అలాగే ఏ హిందూ పండుగలో కూడా పాల్గొనలేదు. చివరికి సంక్రాంతి పండుగను కూడా తాడేపల్లి ప్యాలెస్‌లో గుడి సెట్ వేసి.. అందులో నిర్వహించారు తప్ప.. పక్కనే ఉన్న వెంకటపాలెం టీటీడీ ఆలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తాజాగా వినాయకచవితి పండుగ రోజు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక పూజ నిర్వహించారు. ఆ పూజలో జగన్ పాల్గొన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా పోస్టు చేసింది. కానీ అసలు నిజం ఏమిటంటే.. పండుగ రోజు జగన్ బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌లో ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల పూజ చేశారు.

తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. 2024 ఎన్నికలకు నాలుగు నెలల ముందు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రసంగం వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరో 140 రోజుల్లో ఏపీలో ఓ క్రైస్తవుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడు.. అప్పుడు క్రైస్తవులకు మేలు జరుగుతుంది.. అంటూ పరోక్షంగా జగన్‌ను క్రైస్తవుడు అనే విషయం ప్రస్తావించారు. ఈ వీడియోపై టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం సహా ఇతర పార్టీలు తమ స్టాండ్ చెప్పాలని సాయిరెడ్డి డిమాండ్ చేశారు. అదే సమయంలో వైసీపీలో నంబర్ వన్‌ ఎవరైతే ఉన్నారో.. అంటూ పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు సాయిరెడ్డి.

Also Read : టీడీపీ గేమ్ ప్లాన్.. వైసీపీలో గుబులు..!

గతంలో ఎంతమంది నాయకులు ఎమ్మెల్యే టికెట్ల కోసం, ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం జగన్‌ను ఆకట్టుకునేందుకు మతం మార్చుకున్నారో.. ఇప్పుడు వైసీపీలో నంబర్ వన్ సమాధానం చెప్పాలంటూ సాయిరెడ్డి పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ప్రశ్న వైసీపీలో చాలా మంది నేతలను వేసినట్లుగా ఉంది. మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబాలు ఇటీవల క్రైస్తవ మత ఆచారాలను పాటిస్తూ.. ప్రార్ధానలు నిర్వహిస్తన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి కూడా తమ కుమారుడి వివాహ వేడుకలను క్రైస్తవ మతాచారంలోనే నిర్వహించారు. ఇవన్నీ సాయిరెడ్డి పరోక్షంగా ప్రస్తావించినట్లు అయ్యింది. ఇప్పటి వరకు జగన్ మా రెడ్డి కులపోడు అని చెప్పుకునే వారికి.. సాయిరెడ్డి పోస్టు చేసిన వీడియోతో దిమ్మ తిరిగినట్లు అయ్యిందనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కోర్ట్ లో ఐబొమ్మ...

తెలుగు సినీ పరిశ్రమను వణికించిన ప్రముఖ...

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణకు...

చంద్రబాబు సంచలన ప్రకటన.....

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు...

వైసీపీ ఒక్క సీటు...

ఉత్తరాంధ్రలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది....

చరిత్రలోనే తొలిసారి.. పవిత్ర...

ఇస్లాం మతస్తుల అత్యంత పవిత్ర నగరమైన...

ఏపీ పట్టణాలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు,...

పోల్స్