Wednesday, September 16, 2026 04:23 PM
Wednesday, September 16, 2026 04:23 PM

బ్రేకింగ్: ఏపీ మాజీ మంత్రి కన్నుమూత

ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన చివరి శ్వాస విడిచారు. ఆళ్ల నాని హఠాన్మరణ వార్త తెలిసి ఏలూరు జిల్లాతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

Also Read : బొత్స కన్నీళ్లు.. లెక్క చేయని జగన్..!

ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం ఏలూరు నియోజకవర్గంతో విడదీయరానిదిగా సాగింది. తొలుత ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆయనకు అత్యంత కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు దక్కాయి. కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు, జిల్లా అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర ఎనలేనిది.

Also Read : బ్రేకింగ్: బెజవాడలో హైఅలెర్ట్.. బస్టాండ్ లో భారీగా పేలుడు పదార్ధాలు

నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడూ మమేకమై ఉండే నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవలి కాలంలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరి క్రియాశీలకంగా మారుతున్న తరుణంలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఆళ్ల నాని మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన మరణంతో ఏలూరు జిల్లా అంతటా విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ ఒక్క సీటు...

ఉత్తరాంధ్రలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది....

చరిత్రలోనే తొలిసారి.. పవిత్ర...

ఇస్లాం మతస్తుల అత్యంత పవిత్ర నగరమైన...

ఏపీ పట్టణాలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు,...

యూపీఐ చార్జీలు.. ఎక్కడ,...

డిజిటల్ పేమెంట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు...

ఏపీలో ఉద్యోగాల జాతర.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ ఉద్యోగార్థులకు కూటమి...

యూపీఐ లావాదేవీలపై ఛార్జీల...

దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు...

పోల్స్