ఏపీలో స్థానిక సంస్థల వేడి రాజుకుంది. అయితే సాధారణంగా ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ముందుగా తమ ఆసక్తిని వ్యక్తం చేస్తారు. అలా కూటమిలోని మూడు పార్టీలలో ఔత్సాహికులు తమ అభిలాషను వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారికంగా ఎవరూ బయటకు చెప్పలేకపోతున్నారు. దానికి కూడా కూటమిగా ఉండడం.. ఎవరికి వారుగా ముందుగా ప్రకటించుకోవద్దని తమ పార్టీల నాయకులకు కూటమి పార్టీల అధినాయకత్వాలు హెచ్చరించిన నేపథ్యం ఉంది. అదే సమయంలో సీట్లు ఎవరికి ఎంత శాతం అన్న లెక్క ముందు తేల్చుకోవాలని చూస్తున్నారు. ఐక్యంగా పోటీ చేయడానికే కూటమి పార్టీలు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. దాంతో సర్దుబాటు కోసం సీట్ల విషయంలో చర్చకు మూడు పార్టీల అధినాయకత్వాలు కలిసి చర్చించడానికి సిద్ధపడుతున్నాయి.
Also Read : కేంద్రం ఒత్తిడికి దిగొచ్చిన మెటా.. ఆ కంటెంట్‌పై సంచలన నిర్ణయం..!
ఇక కూటమి పార్టీలలో ముఖ్యమైన మిత్రపక్షం జనసేన. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లారు. ఆయన ఎపుడు వస్తారు అనే విషయం సొంత పార్టీ నేతలకు కూడా తెలియదు. పార్టీ నేతలు కూడా ఎవరివి వారికే ఊహాగానాలు ఉన్నాయి. అయితే తాజాగా జనసేన పార్టీ సామావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం.. పవన్ 15-16 తేదీల్లో వస్తారు అని చెప్పారు. ఆయన పార్టీ ఆఫీసుకి వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల మీద సమీక్షలు నిర్వహిస్తారని కూడా మనోహర్ తెలిపారు. పవన్ బీ ఫారాలు ఇస్తారని.. ఆయన సంతకం చేసిన బీ ఫారాలు ఉన్న వారే అభ్యర్ధులుగా ఉంటారని.. ఈ లోగా ఎవరు పోటీ చేస్తామని ప్రకటించుకున్నా అది తొందరపాటుతో పాటు వ్యక్తిగతం అవుతుందని మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు.
Also Read : బాబు పోలవరం Vs కేసీఆర్ కాళేశ్వరం.. ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు
దాంతో పవన్ వచ్చాక కూటమి నేతల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా సీట్ల సర్దుబాటు విషయంలో ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ కూడా కూటమితో పొత్తులో ఉంటే గణనీయంగా సీట్లు గెలుచుకోవచ్చు అని భావిస్తోంది. ఈసారి ఆ పార్టీ నుంచి కూడా అనేక మంది పోటీకి సిద్ధంగా ఉన్నారు. విశాఖ, రాజమండ్రి మేయర్ సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతోంది. అలాగే జెడ్పీల విషయానికి వస్తే అల్లూరి జిల్లాతో పాటు గోదావరి జిల్లాలు, కోస్తాలో కొన్ని కోరుకుంటున్నట్లు ప్రచారం. ఈ ప్రచారం ఇలా ఉండగానే స్థానిక ఎన్నికల విషయంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ స్పందించారు.
స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాలపై క్లారిటీ రాలేదు.. అని ఆయన చెప్పడం విశేషం. రానున్న మూడు రోజులలో కూటమి పార్టీలు కూర్చుని చర్చిస్తామని చెప్పారు. అలాగే స్థానిక ఎన్నికల పోటీ విధివిధానాలపై చర్చ ఉంటుందని అన్నారు. ఈసారి బీజేపీ నుంచి కూడా వంద శాతం స్ట్రైక్ రేట్ కోసం ప్రయత్నిస్తామని మాధవ్ చెప్పడం విశేషం. స్థానిక ఎన్నికలపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ స్పందన చూస్తే మరో మూడు రోజులలో కూటమి పార్టీలు కలిసి కూర్చుని చర్చిస్తాయనే క్లారిటీ అయితే వచ్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ సీట్ల సర్దుబాటు గురించి కీలక చర్చలు జరుపుతారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

