Sunday, September 13, 2026 10:50 AM
Sunday, September 13, 2026 10:50 AM

వల్లభనేని ఆస్తుల గుట్టు విప్పిన కొడాలి..!

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లో వంశీకి రూ.10 వేల కోట్ల విలువైన 200 ఎకరాల ఆస్తి ఉందని కొడాలి నాని బహిరంగంగా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నాని బయటపెట్టిన ఈ లెక్కలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

Also Read : ఉత్తరాంధ్రలో వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

అయితే ఈ ఆస్తులన్నీ వంశీ రాజకీయాల్లోకి రాకముందే అంటే 90ల్లోనే సంపాదించాడని నాని సమర్థించే ప్రయత్నం చేయడం విశేషం. ఆ తర్వాత వంశీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా చక్రం తిప్పడంతో పాటు, పలు ప్రముఖ సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయన సంపాదన కేవలం రూ.10 వేల కోట్లతో ఆగిపోదని, వాస్తవానికి వంశీ ఆస్తుల విలువ దాదాపు రూ.40 వేల కోట్ల వరకు ఉంటుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read : DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా?

2024 ఎన్నికల్లో ECకి సమర్పించిన అఫిడవిట్‌లో తన కుటుంబ ఆస్తులు కేవలం రూ.69.32 కోట్లేనని చూపించిన వంశీ.. ఈ వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎక్కడ దాచారు? అఫిడవిట్‌లో చూపని ఈ రూ.40 వేల కోట్ల అక్రమ లాకర్ అసలు ఎవరి పేర్ల మీద ఉంది? నాని చేసిన ఈ ప్రకటనలు ఇప్పుడు వంశీ బినామీ ఆస్తుల బాగోతాన్ని పూర్తిగా బట్టబయలు చేస్తున్నాయి. ఈ భారీ ఆస్తుల గుట్టు ఇప్పుడు స్వయంగా వారి నోటనే బయటపడటం గమనార్హం. చట్టబద్ధంగా చూపించిన ఆస్తులకు, బహిరంగంగా తేలిన వేల కోట్ల సంపదకు మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసంపై ఐటీ, ఈడీ అధికారులు వెంటనే దృష్టి సారించాలనే డిమాండ్లు గట్టిగా వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

ఉత్తరాంధ్రలో వైసీపీ వైట్...

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం...

పోల్స్