భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో విశ్వరూపం చూపించాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కిషన్.. అద్భుతమైన ‘డబుల్ సెంచరీ’ సాధించి సరికొత్త రికార్డులతో చరిత్ర సృష్టించాడు. తిలక్ వర్మ నేతృత్వంలోని సౌత్ జోన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఈస్ట్ జోన్‌ను మ్యాచ్‌పై పూర్తి ఆధీనంలోకి తీసుకొచ్చాడు.
Also Read : అప్పటి వరకు సభకు వచ్చేది లేదు..!
దులీప్ ట్రోఫీ సుదీర్ఘ చరిత్రలో.. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ మార్కును అందుకున్న ఐదో బ్యాటర్‌గా ఈషాన్ కిషన్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ ఘనత సాధించిన దిగ్గజాల సరసన కిషన్ చేరాడు. అంతకుముందు రమన్ లాంబా (320), అంశుమన్ గైక్వాడ్ (216), ఛతేశ్వర్ పుజారా (256 నాటౌట్), మరియు యశస్వి జైస్వాల్ (209) మాత్రమే దులీప్ ట్రోఫీ ఫైనల్స్‌లో ద్విశతకాలు బాదారు. ఆ ఎలైట్ లిస్టులోకి ఇప్పుడు ఈషాన్ కిషన్ అడుగుపెట్టాడు.
Also Read : యూరప్ కు భారత్ దిక్కు అయిందా..?
ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఈషాన్ కిషన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన 10వ సెంచరీని నమోదు చేయడమే కాకుండా, ఈ ఫార్మాట్‌లో 4,000 పరుగుల మైలురాయిని కూడా విజయవంతంగా దాటేశాడు. మొదటి రోజు సెంచరీ (111 నాటౌట్)తో నిలిచిన కిషన్, రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో కుమార్ కుశాగ్రతో కలిసి ఈస్ట్ జోన్‌కు భారీ స్కోరు అందించాడు. గత కొన్ని రోజులుగా రెడ్-బాల్ క్రికెట్‌లో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్న కిషన్‌కు ఈ ఇన్నింగ్స్ అత్యంత కీలకంగా మారింది. హై-ప్రెజర్ ఫైనల్ మ్యాచ్‌లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల తన టెక్నికల్ సామర్థ్యాన్ని, టెంపర్మెంట్ ను నిరూపించుకోవడం ద్వారా జాతీయ సెలెక్టర్లకు ఈషాన్ కిషన్ గట్టి సిగ్నల్స్ పంపాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

