Monday, September 7, 2026 04:42 PM
Monday, September 7, 2026 04:42 PM

ఈరోజు రాశి ఫలితాలు (07-09-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళ పక్షం.. 07-09-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించాలి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

—————————————

వృషభం

వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఋణదాతల నుండి ఒత్తిడులు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

—————————————

మిధునం

మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి సభ, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.

—————————————

కర్కాటకం

ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

—————————————

సింహం

వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి.

—————————————

కన్య

విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగపరంగా అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

—————————————

తుల

వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. విందు వినోదాది కార్యక్రమాలకు హాజరు అవుతారు.

—————————————

వృశ్చికం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి కొన్ని పనులలో ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

—————————————

ధనస్సు

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

మకరం

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం.

—————————————

కుంభం

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

—————————————

మీనం

కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

యుద్ధం కోసం ఉక్రెయిన్...

రష్యాతో సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి అవసరమైన...

బ్రేకింగ్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో...

సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్‌స్టైల్ వీడియోలతో...

నటి త్రిష వివాదంపై...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులతో ముఖ్యమంత్రి...

ఫోటోలు ఫ్లెక్సీల కోసం...

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. జరుగుతోన్న...

చంద్రబాబు సొంత జిల్లాకు...

సిఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా...

జాతీయ స్థాయిలో ట్రెండ్...

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో...

పోల్స్