నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రం ‘NBK 111’ అధికారిక టైటిల్‌ను, విడుదల తేదీని మేకర్స్ వెల్లడించారు. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ చిత్రానికి ‘దాదా’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బాలయ్య మాస్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా ఉన్న ఈ టైటిల్ అభిమానుల్లో అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన మాస్ సంచలనాన్ని మించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నట్లు తాజా ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి.
Also Read : నిమ్మగడ్డ కొంప ముంచిన జగన్ స్నేహం..!
టైటిల్‌తో పాటు విడుదల చేసిన బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ విజువల్స్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ నడిబొడ్డున టేబుల్‌పై దర్జాగా కూర్చొని, పోలీసులకే రైఫిల్ గురిపెట్టిన బాలయ్య లుక్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఆయన స్టైలిష్ గెటప్, తీక్షణమైన చూపులు, చేతిలో రైఫిల్‌తో కనిపించిన విధానం చూస్తుంటే ‘దాదా’లో బాలయ్య పాత్ర ఎంత శక్తిమంతంగా ఉండబోతోందో అర్థమవుతోంది.
“నాకు గురిపెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు… బుల్లెట్స్‌కి బలుపు ఉండాలి, గన్స్‌కి గట్స్ ఉండాలి!” అంటూ బాలకృష్ణ చెప్పిన వార్నింగ్ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలయ్య మార్క్ డైలాగ్ డెలివరీకి గోపీచంద్ మలినేని మాస్ టేకింగ్ తోడవడంతో ఈ సన్నివేశం థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. టైటిల్, లుక్, డైలాగ్—మూడూ మాస్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని రూపొందించినట్లున్నాయి.
Also Read : అయ్యన్న పాత్రుడి అలుపెరుగని రాజకీయ ప్రస్థానం
ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ‘దాదా’ తెరకెక్కుతున్నట్లు సమాచారం. యాక్షన్, ఎమోషన్‌తో పాటు బాలకృష్ణ అభిమానులు కోరుకునే మాస్ అంశాలకు చిత్రంలో పెద్దపీట వేస్తున్నారని తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 24న, క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బాలయ్య మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మాస్ పవర్ చూపించేందుకు సిద్ధమవుతున్నారనే చెప్పాలి.

