మార్కాపురం.. తాగు నీటి కోసం ఏళ్ల తరబడి వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రజలు.. సాగు నీటి కోసం ఆకాశం వైపు ఆశగా చూసే రైతన్నలు.. కూత వేటు దూరంలోనే కృష్ణమ్మ.. అయినా సరే.. ఏడాదికో పంట వేసుకునేందుకు అన్నదాతలు భయపడే పరిస్థితి. కేవలం వర్షం పైన మాత్రమే ఆధారపడిన అన్నదాతకు చంద్రన్న భరోసా ఇచ్చారు. మీ జీవితాల్లో వెలుగులు నింపుతా అంటూ హామీ ఇచ్చారు. తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఏడాదిలోనే కరువు సీమకు కృష్ణమ్మను తీసుకువచ్చే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
Also Read : ఇరాన్‌పై అమెరికా ఆంక్షల సెగ.. భారత్‌కు తగులుతోందా..?
ఆ తర్వాత ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు.. మరెన్నో సమస్యలు… అయినా సరే.. మొక్కవోని దీక్షతో ముందడుగు వేశారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వెలిగొండ పనులకు బ్రేక్ వేస్తే ఏం జరుగుతుందో వారికి తెలుసు.. అందుకే పనులు కొనసాగించారు. ప్రాజెక్టులో భాగంగా కీలకమైన గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల వద్ద గ్యాప్ పూర్తి చేశారు. కానీ సొరంగం పనులు మాత్రం నత్తతో పోటీ పడ్డాయి. మళ్లీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. పనులు పరుగులు పెట్టించారు. రెండో సొరంగం పనులకు శ్రీకారం చుట్టారు. ఇక 2024లో నాలుగోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. చెప్పినట్లుగా సరిగ్గా రెండేళ్లకు పనులు పూర్తి చేశారు.
2026, ఆగస్టు 31వ తేదీ మార్కాపురం జిల్లా వాసుల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. హామీ ఇచ్చినట్లుగా ఆగస్టు నెలాఖరుకు వెలిగొండ ఫేజ్ 1 పూర్తి చేసి నల్లమల సాగర్‌కు సాగునీరు విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సుమారు 30 లక్షల మందికి తాగు నీటి దాహార్తి తీర్చే ఈ అపూర్వ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చంద్రబాబు వచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సాంప్రదాయమైన పంచెకట్టులో గంటవాని పల్లె చేరుకున్నారు. అక్కడ కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జల హారతి ఇచ్చారు. అనంతరం ఫీడర్ కెనాల్ ద్వారా ఏకంగా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్‌కు విడుదల చేశారు.
Also Read : బెజవాడ మేయర్ పీఠం కోసం సిగపట్లు..!
కోట్ల మంది రైతుల కల సాకారం కూడా ఒక రైతు చేతుల మీదుగానే చేశారు చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్లను ఓ సాధారణ రైతు చేతుల మీదుగా ప్రారంభించారు. తమ ప్రాంత అపర భగీరధుడు చంద్రన్నకు మార్కాపురం జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. జన నీరాజనం అందించారు. సాంప్రదాయ నృత్యాలతో తమ నేలను నీటితో పులకించేలా చేసిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రైతు కళ్లల్లో కృష్ణమ్మ పరవళ్లు చూసిన ఆనందం. నాలుగు జిల్లాల ప్రజల సాగు, తాగు నీరు అందించే వెలిగొండ.. ఇది ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు.. ఇది ఒక ఎమోషన్ కూడా.

