నారా చంద్రబాబు నాయుడు పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది అభివృద్ధి. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగానికి ఆద్యుడిగా.. టెక్నాలజీలో ఉమ్మడి ఏపీని టాప్ పొజిషన్‌కి తీసుకెళ్లిన విజనరీ నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుంది. కానీ చాలా మంది గుర్తించ లేదు గానీ.. బాబుగారు ఐటీతో పాటు అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి విశేషంగా కృషి చేశారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు తనదైన ముద్ర వేశారు.
ప్రస్తుతం రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్న హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి నిరంతరం నీళ్లు అందించే ముచ్చుమర్రి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు. 2017లో ముచ్చుమర్రికి శంకుస్థాపన చేసి రికార్డు సమయంలో ప్రాజెక్టుని పూర్తి చేయడమే కాకుండా.. రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.
Also Read : టాక్సిక్ అట్టర్ ఫ్లాప్.. కానీ లాభాల పంట పండిందా..?
పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని ముందే ఊహించి.. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించిన దార్శనికత కూడా చంద్రబాబుదే. 2015లో ఆయన ఆలోచనల నుంచి పుట్టిన పట్టిసీమ.. ఇప్పటి వరకు 450 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు చేర్చింది. ఈ ఎల్‌నినో కాలంలోనూ గోదావరి నుంచి నిత్యం ఏడు వేల క్యూసెక్కులకుపైగా గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజీకి వస్తున్నాయంటే.. అది బాబుగారి ముందు చూపు ఫలితమే.
2017లో చంద్రబాబు ప్రారంభించిన పురోషత్తపట్నం ఎత్తిపోతల పథకం.. ఇప్పుడు ఉత్తరాంధ్రకు గోదావరి జిలాలను అందించేందుకు ఉపయోగపడుతోంది. ఇప్పటికే పోలవరం ఎడమ కాలువలో ట్రయల్ రన్ ప్రారంభమైంది. కొన్ని రోజుల్లో గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు చేరుకోబోతున్నాయి. తర్వాత దశలో విశాఖపట్నం వరకు గోదావరి నీటిని తరలించడానికి పనులు జరుగుతున్నాయి.
ఉమ్మడి ఏపీ సీఎంగా 2003లో నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజీకి శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. 2015లో తన చేతుల మీదుగానే ఆ ప్రాజెక్టుని ప్రారంభించి శ్రీకాకుళం జిల్లాలో సాగనీటి కష్టాలు తీర్చారు. అంతకు ముందే 1996లో పశ్చిమ ప్రకాశం జిల్లాలో తాగు, సాగునీటి సమస్యలకు పరిష్కారంగా వెలిగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన చేతుల మీదుగానే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
Also Read : ఫైనల్ కష్టమేనా..? భారత్ కు టెస్ట్ ఛాంపియన్ షిప్ కష్టమే..!
ఉమ్మడి ఏపీలో భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలో పురుడు పోసుకున్నాయి. ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనులు పూర్తవడానికి సమయం పడుతుందని.. నాగార్జునసాగర బ్యాక్‌వాటర్స్ నుంచి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించాలన్న ఆలోచన కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఫలితమే. ఈ ఎస్ఎల్బీసీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాలు సాగు నీటితో పాటు హైదరాబాద్ నగరానికి సాగునీరు అందుతోంది.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గాలేరు – నగరి వంటి ప్రాజెక్టులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వేగంగా నిర్మాణం పూర్తి చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చాలా సమయం పడుతుంది. ఎంతో క్లిష్టమైన, సాంకేతికంగా అత్యంత కష్టమైన ఇంజనీరింగ్ అద్భుతాలు.. పక్కా ప్లానింగ్, పట్టువదలని దీక్ష, నిరంతర కృషితోనే ఆచరణ సాధ్యం అవుతాయి. వైసీపీ హయాంలో మా వల్ల కాదు అని వదిలేసిన పోలవరం ప్రాజెక్టుని ఒక దారికి తీసుకొచ్చి.. ఇంకో ఏడాదిలో పూర్తి చేసే స్థాయికి చేర్చడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైన విషయం. చంద్రబాబు కృషి ఫలితంగా లోటు వర్షపాతం సీజన్లోనూ.. ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా డెల్టా వరకు.. ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ వరకు కొత్త ప్రాజెక్టుల ద్వారా నీటిని అందిస్తున్నారు. అందుకే ఆయన ఐటీకి ఆద్యుడు మాత్రమే కాదు.. అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులను సాధ్యం చేసి చూపించిన అపర భగీరథుడు.. రైతు బాంధవుడు అనడమే కరెక్ట్.

