Friday, August 28, 2026 03:25 PM
Friday, August 28, 2026 03:25 PM

ఏపీ మున్సిపాలిటీలకు మహర్దశ.. భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల రూపురేఖలను మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు మరియు నగర పాలక సంస్థలలో మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ఏకంగా రూ.7,469.46 కోట్ల భారీ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ బృహత్తర నిధుల కేటాయింపుతో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీలు, పచ్చదనం మరియు లైటింగ్ వ్యవస్థలు సరికొత్త రూపును సంతరించుకోనున్నాయి.

Also Read : నైట్ క్లబ్ రచ్చ.. ఆ క్రికెటర్ కెరీర్ క్లోజ్..?

ఈ ప్రాజెక్టులో భాగంగా పట్టణ పరిధిలో 100 శాతం రోడ్డు అనుసంధానతను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. 123 మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు మిగిలిపోయిన 4,388 కిలోమీటర్ల పొడవైన అంతర్గత మరియు ప్రధాన రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులను ఈ నిధులతో చేపట్టనున్నారు. ఇందులో కేవలం అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో కూడిన సిమెంట్ మరియు తారు రోడ్ల నిర్మాణాల కోసమే అత్యధికంగా రూ.4,655.82 కోట్లను కేటాయించడం విశేషం.

Also Read : గుండెపోటు ముప్పును ముందే గుర్తించే టెస్ట్..!

దీనివల్ల వర్షాకాలంలో పట్టణాల్లో నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం లభించనుంది. రహదారులతో పాటు పట్టణ పౌరుల ఆహ్లాదం, రక్షణ మరియు సుందరీకరణకు ఈ ప్రాజెక్టులో సమాన ప్రాధాన్యత ఇచ్చారు. పట్టణాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు రూ.509.12 కోట్ల వ్యయంతో 541 కొత్త పార్కులను అభివృద్ధి చేయనున్నారు. అలాగే, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం రూ.247.28 కోట్లతో కొత్తగా 20,340 వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 1,186 కిలోమీటర్ల పొడవునా రోడ్ డివైడర్లు సుందరీకరించేందుకు మరో రూ.87.78 కోట్లను కేటాయించారు. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి పట్టణ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇలా అయితే ...

ఏ రాజకీయ పార్టీలో అయినా సరే.....

సీఎం రేవంత్‌కు మంత్రి...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

అమరావతిలో మళ్ళీ ల్యాండ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను...

మళ్ళీ తెరమీదకు బీసీ...

మాజీ మంత్రి విడదల రజనీ అప్పుడప్పుడు...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన...

ఆ విషయంలో వైసీపీ...

కాలం కలిసి రాకపోతే తాడు కూడా...

పోల్స్