Monday, October 12, 2026 10:55 AM
Monday, October 12, 2026 10:55 AM

తెలుగుదేశం పార్టీకి కేంద్రం కీలక పదవి..!

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఇంకా చెప్పాలంటే.. మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం పార్టీనే ప్రధాన కారణం. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు మోదీ సర్కార్‌కు మద్దతుగా నిలబడటం వల్లే ఎన్‌డీఏ సర్కార్‌క ఏర్పాటయ్యింది. ఇందుకు ప్రతిఫలంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు కేటాయించారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనసాగుతుండగా.. కేంద్ర సహాయ మంత్రిగా డా.పెమ్మసాని చంద్రశేఖర్‌కు అవకాశం వచ్చింది. వీరితో పాటు ఇటీవల ఓ గవర్నర్ పదవి కూడా టీడీపీ ఖాతాలో చేరింది.

Also Read : వైసీపీలో తారాస్థాయికి ఆధిపత్య పోరు..!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇక ఎన్‌డీఏ సర్కార్ ఏర్పడి రెండేళ్లు దాటిన సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకుంటోంది. అలాగే త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. భారీ మార్పులు చేర్పులు చేపడుతోంది. ఇందులో భాగంగానే కొన్ని రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్‌లను నియమించాలని కేంద్రం భావిస్తోంది. త్వరలో దాదాపు 8 రాష్ట్రాల గవర్నర్‌లను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటిల్లో ఒకటి తెలుగుదేశం పార్టీకి ఇచ్చేందుకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో మోదీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీనియర్లుగా ఉన్న ఇద్దరు నేతల్లో ఒకరికి గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ స్పీకర్లు ప్రతిభా భారతి, యనమల రామకృష్ణుడులో ఒకరికి గవర్నర్ పదవి దక్కడం ఖాయమనే మాట పార్టీలో బాగా వినిపిస్తోంది. ఎస్సీ మహిళ కోటాలో ప్రతిభా భారతి పేరు, బీసీ నేత విభాగంలో యనమల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటి వరకు యనమల కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మాత్రమే యనమలకు అవకాశం రాలేదు. ఇందుకు ప్రతిగా ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రభుత్వ విప్ పదవి కేటాయించారు.

Also Read : దిల్ రాజుకు ఇతర భాషలు కలిసి రావడం లేదా..?

అటు కావలి ప్రతిభా భారతి సేవలకు గుర్తింపుగా ఆమె కుమార్తె కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. త్వరలో జరగనున్న కొత్త గవర్నర్ల నియామకంలో గోవా గవర్నర్‌గా వ్యవహరిస్తున్న అశోక్ గజపతి రాజును పెద్ద రాష్ట్రానికి బదిలీ చేస్తారనే మాట కూడా వినిపిస్తోంది. దీంతో ఎవరిగి గవర్నర్ గిరి అవకాశం దక్కుతుందా అని పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఎన్టీఆర్ కట్టించిన ఇల్లు.....

హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే...

వైసీపీ కుట్రలకు చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం...

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

పోల్స్