Thursday, August 27, 2026 12:01 PM
Thursday, August 27, 2026 12:01 PM

వైసీపీలో తారాస్థాయికి ఆధిపత్య పోరు..!

ఓ వైపు అధికారం కోల్పోయిన నిర్వేదం.. మరోవైపు పక్క జిల్లాల నేతల పెత్తనం.. ఇదే ఇప్పుడు వైసీపీ నేతల్లో ఉన్న అసహనం. చివరికి జిల్లాకు పార్టీ నియమించిన ఇంఛార్జ్ తీరుపై తీవ్ర ఆగ్రహం. నువ్వు ఎవరు చెప్పడానికి అంటూ బహిరంగ వ్యాఖ్యలు. ఇదే ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరాంధ్రకు చెందిన నేతల్లో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేతలు. ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి సహచరులు. ఈ ఇద్దరు నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. బొత్స పీసీసీ అధ్యక్షుడిగా, ధర్మాన రెవెన్యూ మంత్రిగా చక్రం తిప్పారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.

Also Read : వైసీపీ ప్రేమలో సిఐ గారు.. పోలీస్ బాస్ ల రియాక్షన్ ఇదే..!

శ్రీకాకుళం జిల్లా వైసీపీ బాధ్యతలను ప్రస్తుతం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇంఛార్జ్‌గా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రతి విషయాన్ని పార్టీ పెద్దలకు బొత్స రిపోర్టు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు జిల్లా నేతలకు ఏ మాత్రం నచ్చటం లేదు. అసలు మీరు ఎవరు.. మా మీద మీ పెత్తనం ఏమిటంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసే వరకు పరిస్థితి చేరుకుంది. తాజాగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు చేసిన విమర్శలు వైసీపీలో ఆధిపత్య పోరును బయటపెట్టాయి. “పక్క జిల్లా నేతల సలహాలు మాకు అనవసరం. ముందు అక్కడే పెద్ద కన్నముంది. దాన్ని చూసుకోమనండి.” అంటూ రామ్ మనోహర్ నాయుడు అలియాస్ చిన్ని చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read : ఆగిపోయిన వీసా అపాయింట్‌మెంట్లు.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..!

“2004 నుంచి ధర్మాన ప్రసాదరావును గెలిపించింది పక్క జిల్లా నేతలు కాదని గుర్తుంచుకోండి. మేము కూడా పక్క జిల్లాకు వెళ్లగలం. వారి సలహాలు, సూచనలు ఇక్కడ అవసరం లేదు. శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ జెండా మోయడానికి మనిషి లేనప్పుడు మా నాన్న ఇక్కడ పార్టీని నిలబెట్టారు. ఇక్కడ ఉన్న వారంతా ధర్మాన కేడరే. ఎవరి పెత్తనం మాకు అక్కర్లేదు. నా తలను నేనే దువ్వుకుంటే పాపిడి తిన్నగా వస్తుంది. పక్కోడు దువ్వితే వంకర టింకర పోతుంది.” అంటూ ధర్మాన చిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు చేసింది పరోక్షంగా బొత్స సత్యనారయణను ఉద్దేశించి అనేది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడెందుకు చేశారనే విషయం మాత్రం ఎవరికీ తెలియటం లేదు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజయవాడలో బీసీల సమావేశానికి హాజరయ్యారు. పక్క జిల్లా నేతలు శ్రీకాకుళం జిల్లాలో తల దూరుస్తున్నారని చిన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్ని చేసిన వ్యాఖ్యలపై బొత్స అభిమానులు, కాపు సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ చెబితేనే బొత్స శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నారని.. అంతే తప్ప ఆయనకు రావాల్సిన అవసరం లేదన్నారు. బొత్స సీనియారిటీ, ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి జగన్‌కు తెలుసు కాబట్టే.. పార్టీ ఓడిన వెంటనే.. బొత్సను ఎమ్మెల్సీ చేసి.. వైసీపీ పక్ష నేతగా ఎంపిక చేశారంటున్నారు.

Also Read : జోగి నీకు ఓ కూతురు ఉంది.. కోడలు మేఘన సంచలనం..!

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో వెలమ నేతల పెత్తనం ఎక్కువైందని కాళింగ వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు. తాజాగా చిన్ని చేసిన వ్యాఖ్యలతో కాపు నేతల్లో కూడా వెలమల పట్ల అసహనం పెల్లుబికింది. దీనిపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపులు గుర్రుగా ఉన్నారు. ఈ నెల 31న ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో చేపట్టిన పార్టీ సమావేశానికి దూరంగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని.. ధర్మాన చిన్ని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పక్క జిల్లా నేతల సలహాలు, సూచనలు మాకు అవసరం లేదంటున్న ధర్మాన.. గతంలో పక్క జిల్లా నేతలతో ఎందుకు మంతనాలు జరిపారో చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ధర్మాన చిన్ని చేసిన వ్యాఖ్యలు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వైసీపీ నేతల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ విషయంలో వైసీపీ...

కాలం కలిసి రాకపోతే తాడు కూడా...

తెలుగుదేశం పార్టీకి కేంద్రం...

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌లో...

దిల్ రాజుకు ఇతర...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు...

ఆ ప్రశ్నలకు సాయిరెడ్డి...

రాజకీయాల్లో మిత్రులు శత్రువులుగా మారడం కొత్తేమీ...

వైసీపీ ప్రేమలో సిఐ...

పులివెందులలో వైకాపా కబ్జాదారులకు కొందరు పోలీస్...

ఏపీలో వాళ్లకు గుడ్...

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద...

పోల్స్