Monday, October 12, 2026 09:25 AM
Monday, October 12, 2026 09:25 AM

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మైథలాజికల్ ఎపిక్.. రెండు పవర్‌ఫుల్ టైటిల్స్ రిజిస్టర్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక భారీ మైథలాజికల్ యాక్షన్ విజువల్ వండర్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు ఎనిమిదేళ్లకు ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్‌పైకి వెళ్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఫిలిం ఛాంబర్‌లో గాడ్ ఆఫ్ వార్ మరియు దేవసేనాపతి అనే రెండు అత్యంత పవర్‌ఫుల్ టైటిళ్లను రిజిస్టర్ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : మానవ్ సుతార్ సక్సెస్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ స్టార్ అతనే..!

ఈ సినిమా పూర్తిగా హిందూ పురాణాల్లోని శివపార్వతుల పుత్రుడు, యుద్ధ దేవుడైన కుమారస్వామి కథాంశం స్ఫూర్తితో రూపొందనుంది. ఈ చిత్ర అధికారిక అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేస్తూ.. కుమారస్వామి పవర్‌ఫుల్ ఆయుధమైన వేల్ ను చూపిస్తూ, దాని నుండి ఒక డీఎన్‌ఏ స్ట్రాండ్ ఉద్భవిస్తున్నట్లు చూపించిన విజువల్స్ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేశాయి. ఈ భారీ బడ్జెట్ పాన్-ఇండియా విజువల్ ఎపిక్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్, ఎస్. రాధాకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read : శరీరంలో దాగున్న పాత వైరస్‌లను కరోనా నిద్రలేపుతోందా..?

దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ యాక్షన్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత, 2027 ద్వితీయార్థంలో ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రిజిస్టర్ చేసిన ఈ రెండు టైటిళ్లలో త్రివిక్రమ్ దేనిని ఫైనల్ చేస్తారనే దానిపై త్వరలోనే అధికారిక క్లారిటీ రానుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీ కుట్రలకు చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం...

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

పోల్స్