Wednesday, August 12, 2026 04:12 PM
Wednesday, August 12, 2026 04:12 PM

మెడికల్ రంగంపై డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైనర్ల లింగమార్పిడి శస్త్రచికిత్సలు, హార్మోన్ థెరపీలకు ప్రభుత్వ ఆరోగ్య బీమా కార్యక్రమం ‘మెడికైడ్’ నుండి నిధులను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ సంచలన ఆదేశాలను వెల్లడించారు. అమాయక పిల్లలను ఇలాంటి అనాగరిక పద్ధతులు మరియు శస్త్రచికిత్సల నుండి రక్షించడానికే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.

Also Read : ఢిల్లీ వేదికగా మళ్లీ బీజేపీకి జగన్ జై..!

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ పరిధిలోని సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్ ఈ తుది నిబంధనను అమలు చేసింది. దీని ప్రకారం ఫెడరల్ మెడికైడ్, చిల్డ్రన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ నిధులు ఇకపై మైనర్లకు ప్యూబర్టీ బ్లాకర్స్, క్రాస్-సెక్స్ హార్మోన్లు, లింగమార్పిడి శస్త్రచికిత్సలకు వర్తించవు. ట్రంప్ ఆదేశాల మేరకు సీఎంఎస్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మెహమత్ ఓజ్ ఈ కొత్త రూల్‌ను ప్రకటించారు. పిల్లలను ప్రయోగశాల ఎలుకల్లాగా వాడకూడదని, తగిన శాస్త్రీయ ఆధారాలు లేని ఇలాంటి ప్రయోగాల వల్ల పిల్లల శరీరాలకు కోలుకోలేని నష్టం జరుగుతుందని డాక్టర్ ఓజ్ పేర్కొన్నారు.

Also Read : డిప్యూటి సీఎంగా త్రిష..? మాజీ మంత్రి సంచలనం..!

అలాగే పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం కాకుండా కాపాడుతూ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయడమే తమ ఉద్దేశమని హెచ్హెచ్ఎస్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ స్పష్టం చేశారు. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 13 నుండి పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే హార్మోన్ థెరపీ చికిత్సలు పొందుతున్న మైనర్లకు కొంత ఉపశమనం లభించనుంది. వారికి గరిష్టంగా ఆరు నెలల పాటు ఫెడరల్ నిధుల సహాయం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విదేశీ శ్రీవారి భక్తులకు...

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని...

ప్రకాశ్ రాజ్ ఓటు...

బెంగళూరు నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

డిప్యూటి సిఎం భార్యపై...

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి...

శాంతిభద్రతలపై సీఎం నేడు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా...

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

పోల్స్