రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ వేదికగా మాత్రం బీజేపీతో ఉన్న లోపాయికారీ బంధాన్ని మరోసారి నిరూపించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ అత్యంత వ్యూహాత్మకంగా, సైలెంట్‌గా మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా తమపై ఉన్న పాత కేసుల నుండి రక్షణ కోసమే, పార్లమెంట్‌లో కేంద్రానికి అవసరమైనప్పుడల్లా జగన్ ఇలా గుంభనంగా జై కొడుతున్నారని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు.
Also Read : జూలకంటిని ఇరికించాలని చూసిన జగన్.. చివరికి..!
ఈ కీలకమైన డీలిమిటేషన్ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ తప్పనిసరి కావడంతో, కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడింది. ఇందులో భాగంగానే డీలిమిటేషన్ బిల్లు కోసం ఎఫ్‌సీఆర్‌ఏ చట్ట సవరణ బిల్లుపై రాజీ పడటానికి కూడా కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీతో పాటు డీఎంకే, అకాలీదళ్, ఎన్సీపీ (శరద్ పవార్) వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీలు కూడా తమ సమ్మతిని తెలిపినట్లు ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
Also Read : బాలినేని – దామచర్ల వివాదంపై అధిష్ఠానాల సీరియస్ ఫోకస్..!
మరోవైపు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వస్తున్న ఎఫ్‌సీఆర్‌ఏ చట్ట సవరణ బిల్లును నేరుగా ఆమోదించకుండా, దానిని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. జేపీసీకి పంపడం ద్వారా విపక్షాలను శాంతింపజేసి, అదే సమయంలో ప్రాంతీయ పార్టీల మద్దతుతో అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును గట్టెక్కించాలని కేంద్ర పెద్దలు వ్యూహాత్మక కసరత్తు చేస్తున్నారు.

