Thursday, August 6, 2026 07:31 PM
Thursday, August 6, 2026 07:31 PM

పొగాకు రైతులపై జగన్‌ మొసలి కన్నీళ్లు..!

దేవరాపల్లిలో వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు రైతులతో జరిపిన ముఖాముఖి, తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోలేదంటూ జగన్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని, దమ్ముంటే ఏ ప్రభుత్వం రైతులను ఆదుకుందో గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలని టీడీపీ సవాల్ విసిరింది. రైతులను నడిరోడ్డులో గాలికొదిలేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని, ఏ కష్టమొచ్చినా వారికి అండగా నిలుస్తోంది మాత్రం కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేసింది.

Also Read : మహేష్ బాబు బర్త్ డే సర్ప్రైజ్ తేలిపోతుందా..?

గత వైఎస్సార్సీపీ హయాంలో పొగాకు రైతులు పడిన కష్టాలను టీడీపీ ఉదాహరణలతో సహా వివరించింది. 2019లో 124 మిలియన్ కిలోల ఉత్పత్తి రాగా, ధర కిలోకు రూ.121-123కి పడిపోయింది. ఆ సమయంలో కేవలం 11.8 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేసిన జగన్ సర్కార్..మిగతా రైతులను గాలికొదిలేసిందని టీడీపీ దుయ్యబట్టింది. ఆ తర్వాతి ఏడాది ఏకంగా 128 మిలియన్ కిలోల ఉత్పత్తి వచ్చినా, ప్రభుత్వం ఒక్క కిలో కూడా కొనుగోలు చేయలేదని, రైతులకు కనీస ఆర్థిక సాయం అందించలేదని ఎద్దేవా చేసింది. కానీ, గతంలో 2014-15 టీడీపీ ప్రభుత్వ హయాంలో ధరలు పతనమైనప్పుడు.. పొగాకు వాణిజ్య పంట అని కూడా చూడకుండా చరిత్రలో తొలిసారిగా కిలోకు రూ.20 చొప్పున ఆర్థిక సాయం అందించిన ఘనత తమదేనని గుర్తుచేసింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొగాకు రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని టీడీపీ తెలిపింది. 2019 నుంచి 2023 మధ్య వైసీపీ పాలనలో కిలో వర్జీనియా పొగాకు ధర గరిష్టంగా రూ.140 నుంచి రూ.248 మాత్రమే పలకగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024లో రికార్డు స్థాయిలో రూ.326కు చేరిందని వెల్లడించింది. ఇక ఈ ఏడాది విషయానికొస్తే.. ఉత్పత్తి లక్ష్యం 131 మిలియన్ కిలోలు కాగా, అనుకూల పరిస్థితుల వల్ల రైతులు ఏకంగా 241 మిలియన్ కిలోలు పండించారు. ఇలా అంచనాలకు మించి రికార్డు స్థాయిలో ఉత్పత్తి రావడం వల్లే ధరలు తగ్గాయని, ఈ వాస్తవాన్ని గ్రహించిన వెంటనే రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చిందని స్పష్టం చేసింది.

Also Read : ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?

అధిక దిగుబడితో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు సుమారు 100 మిలియన్ కిలోల పొగాకుకు కిలోకు రూ.10 చొప్పున మొత్తం రూ.100 కోట్ల భారీ ఆర్థిక సాయం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచే ఈ పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభమవుతోంది. అంచనాలకు మించి ఎంత పొగాకు వచ్చినా కిలోకు రూ.10 చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా బ్యారన్‌కు రూ.50 వేల వడ్డీలేని రుణాన్ని మంజూరు చేస్తోంది. ఈ వాస్తవాలన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నా జగన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, రైతులను ఆదుకున్నదెవరో, దగా చేసిందెవరో బహిరంగ చర్చకు సిద్ధమా..? అంటూ మంత్రి అచ్చెన్న సవాల్ విసిరారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పక్కన పెడతారా.. ఉద్యమిస్తారా..?...

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర...

వైసీపీ ఫేక్ ప్రచారానికి...

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం...

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం...

వెంటాడుతున్న ED.. వేల...

వైసీపీ నేతలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ -...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది....

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

పోల్స్