Wednesday, August 5, 2026 05:18 PM
Wednesday, August 5, 2026 05:18 PM

ఇండియన్ ఐటీ ఉద్యోగులకు అమెరికా భారీ షాక్..!

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ సామాజిక వర్గాలకు, ముఖ్యంగా ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ, ఎల్-1 వీసాల పొడిగింపు ప్రక్రియపై సరికొత్త అదనపు రుసుములను విధించేందుకు యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తుది నిబంధనలను సిద్ధం చేసింది. గతంలో కేవలం కొత్త వీసాల దరఖాస్తులకే పరిమితమైన ఈ ప్రత్యేక రుసుములను, ఇకపై ప్రస్తుతం అమెరికాలో ఉంటూ వీసా రినెవల్స్ కోసం అప్లై చేసుకునే ప్రతి ఒక్కరికీ వర్తింపజేయనున్నారు.

Also Read : టాక్స్ చెల్లింపులో రిషభ్ పంత్ క్రేజీ రికార్డ్..!

ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, వారిలో సగానికి పైగా హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులు ఉన్న కంపెనీలు ఈ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రతి కొత్త హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్‌కు 4,000 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు ₹3.3 లక్షలు, ఎల్-1 ఎక్స్‌టెన్షన్‌కు 4,500 డాలర్లు అంటే.. సుమారు ₹3.7 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అమెరికాలోని బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్ నిధుల కోసం ఉద్దేశించిన ఈ 9-11 రెస్పాన్స్ ఫీజు వల్ల అమెరికా ప్రభుత్వానికి ఏటా అదనంగా 157.3 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనుంది.

Also Read : కృష్ణా నదిని మింగేస్తున్నారా..? అమరావతిలో కొత్త కుట్ర..?

అమెరికా వీసా ఎక్స్‌టెన్షన్లలో సింహభాగం భారతీయులవే కావడంతో ఈ నిర్ణయం మన ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అధికారిక గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించబడిన మొత్తం హెచ్-1బీ పొడిగింపుల్లో దాదాపు 77.6% అంటే 2.26 లక్షలకు పైగా భారతీయ నిపుణులవే కావడం గమనార్హం. ఈ కొత్త రూల్ వల్ల అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, యాపిల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలతో పాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి భారతీయ ఐటీ సేవల కంపెనీలకు ఉద్యోగులను అంటిపెట్టుకునే ఖర్చులు భారీగా పెరగనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్