Saturday, September 19, 2026 11:12 AM
Saturday, September 19, 2026 11:12 AM

గుజరాత్ లో దొరికిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే..!

ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పొగాకు వ్యాపారి కుమారుడి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాను ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు గుజరాత్‌ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ సమాచారాన్ని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు సైతం సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు.

Also Read : దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.. వైసీపీ నేత సవాల్..!

కొద్దిరోజుల క్రితం కొయ్యలగూడెం నుండి గుంటూరుకు పొగాకు లోడుతో వెళ్తున్న ఒక వాహనాన్ని నూజివీడు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న పొగాకు వ్యాపారి సూర్యచంద్రం కుమారుడు అభి, డ్రైవర్ బాలరాజు, గుమస్తాలను దుండగులు బలవంతంగా కిడ్నాప్ చేశారు. బాధితులను గుంటూరులోని ఒక గెస్ట్ హౌస్‌ కు తరలించి నిర్బంధించారు. ఆ తర్వాత వ్యాపారి సూర్యచంద్రానికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు, తమకు రావాల్సిన వ్యాపార బకాయిల డబ్బులు వెంటనే ఇవ్వాలని, లేదంటే కొడుకు ప్రాణాలతో దక్కడని బెదిరింపులకు దిగారు.

ఈ బెదిరింపుల వెనుక మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ ప్రమేయం ఉన్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో తక్షణమే స్పందించిన నూజివీడు, పెదకాకాని పోలీసులు సంయుక్తంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి బాధితులను సురక్షితంగా విడిపించారు. ఈ కిడ్నాప్ ఉదంతంపై నూజివీడు పోలీస్ స్టేషన్‌ లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌ తో పాటు మరికొందరిపై కిడ్నాప్, బలవంతపు వసూళ్లు, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Also Read : రోజుకు రెండు అరటిపండ్లు తింటున్నారా..? ఈ విషయం తెలుసా..?

కేసు నమోదైనప్పటి నుండి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యారు. పోలీసులు వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ముస్తఫా గుజరాత్‌ లో దాక్కున్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా పక్కా సమాచారం అందుకున్న నూజివీడు ప్రత్యేక పోలీస్ బృందం, అక్కడికి వెళ్లి ఆయనను విజయవంతంగా అదుపులోకి తీసుకుంది. ముస్తఫాను ట్రాన్సిట్ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌ కు తీసుకువచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్