Monday, August 3, 2026 02:31 PM
Monday, August 3, 2026 02:31 PM

టీడీపీ అధిష్టానానికి ఉమ్మడి కృష్ణా జిల్లా సెగ..!

తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొందరు శాసనసభ్యుల వ్యవహార శైలి ఇప్పుడు పార్టీ అధినాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. 2024 ఎన్నికల్లో జిల్లాలో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ, అంతర్గత వ్యవహారాలు మరియు ఎమ్మెల్యేల వరుస వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని, అధిష్టానాన్ని ఇరుకున పెడుతున్నాయి. ఒకరి వివాదం సద్దుమణుగుతోందనుకునే లోపే మరొకరు లైన్ దాటుతూ ప్రభుత్వ నిర్ణయాలను, సొంత పార్టీ తీరును విమర్శిస్తుండటాన్ని టీడీపీ పెద్దలు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Also Read : ఉరవకొండలో పొలిటికల్ హీట్.. మాజీ ఎంపీ అరెస్ట్..!

ఈ వివాదాలకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మొదట పునాది వేయగా, గెలిచినప్పటి నుంచి ఆయన తీరుపై కేడర్‌ లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎంపీ కేశినేని చిన్నితో విభేదాల నుంచి మొదలై, ఇటీవల ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఆందోళనలను సోషల్ మీడియాలో సమర్థిస్తూ కేంద్రంలోని బీజేపీని కూడా విమర్శించే స్థాయికి ఈ వ్యవహారం వెళ్లింది. ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సైతం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులకు కాంట్రాక్టులు ఇస్తున్నారంటూ సొంత పార్టీపైనే బహిరంగంగా విమర్శలు చేయడం తీవ్ర దుమారం రేపింది.

Also Read : చంద్రబాబు రాజనీతి… అసలు లెక్క ఇదే!

మరోవైపు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముద్రగడ సంస్మరణ సభలో కాపు సామాజికవర్గ అంశాన్ని టచ్ చేస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అధిష్టానాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే కొలికపూడి, బోండా ఉమాలను పిలిపించి వివరణలు కూడా తీసుకుంది. వరుసగా జిల్లా ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుండటంతో, ఇకపై పార్టీ లైన్ దాటి ఏది పడితే అది మాట్లాడే నేతలపై కఠినంగా వ్యవహరించాలని టీడీపీ అధిష్టానం గట్టిగా నిర్ణయించుకుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

పోల్స్