Saturday, August 1, 2026 08:01 PM
Saturday, August 1, 2026 08:01 PM

అద్దె ఇంటి నుంచి 4 వేల కోట్ల రామాయణం వరకు.. ఎవరీ నమిత్ మల్హోత్రా..?

భారత చలనచిత్ర పరిశ్రమలో ఎన్నడూ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమా వెనుక ఉన్న ఒకే ఒక్క వ్యక్తి, ఆస్కార్ అవార్డు గ్రహీత, డీఎన్ఈజీ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో అధినేత నమిత్ మల్హోత్రా. నితీష్ తివారీ దర్శకత్వంలో, రణబీర్ కపూర్, యాష్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న ఈ రెండు భాగాల విజువల్ వండర్ కోసం ఆయన ఏకంగా 500 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.4,000 కోట్లు స్వయంగా పెట్టుబడిగా పెడుతున్నారు. ఈ చారిత్రాత్మక సినిమా వెనుక ఉన్న నమిత్ మల్హోత్రా జీవిత ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం.

Also Read : మోడీని దారుణంగా మాట్లాడారు.. పవన్ సంచలన కామెంట్స్..!

కేవలం 21 సంవత్సరాల వయసులో, ముంబైలోని ఒక చిన్న గ్యారేజ్ నుండి నమిత్ తన పోస్ట్ ప్రొడక్షన్ బిజినెస్‌ ను ప్రారంభించారు. ఆ సమయంలో వ్యాపార విస్తరణ కోసం హై-ఎండ్ ఎడిటింగ్ సిస్టమ్స్ కొనడానికి తన కుటుంబానికి ఉన్న ఏకైక ముంబై ఇల్లును తాకట్టు పెట్టి రూ.2 కోట్ల లోన్ తీసుకున్నారు. ఆయన జీవితంలో తీసుకున్న అతిపెద్ద రిస్క్ అదే. ఆ తర్వాత ఆయన ప్రారంభించిన ప్రైమ్ ఫోకస్ సంస్థ లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ నగరాలకు విస్తరించింది. అయితే, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో ఆయన వ్యాపారం తీవ్రంగా నష్టపోయి, అంతా కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

Also Read : ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.. అర్థమైందా రాజా.. లోకేష్ మాస్ స్పీచ్..!

ఆర్థిక సంక్షోభంలో పడిపోయినా అధైర్యపడకుండా, నమిత్ మల్హోత్రా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగారు. 2014లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న లండన్ వీఎఫ్ఎక్స్ స్టూడియో డబుల్ నెగటివ్ ను కొనుగోలు చేసి, తన సంస్థతో విలీనం చేసి ‘DNEG’గా మార్చారు. ఈ సంస్థ ఇన్‌సెప్షన్, ఇంటర్‌ స్టెల్లార్, బ్లేడ్ రన్నర్ 2049, డ్యూన్, ఒపెన్‌హైమర్ వంటి ప్రపంచ ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించి పలు ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టింది. దాదాపు 9,000 మంది ఉద్యోగులతో గ్లోబల్ లీడర్‌ గా ఎదిగిన నమిత్, ఇప్పుడు భారతీయ పురాణ ఇతిహాసం రామాయణంను అవెంజర్స్, అవతార్ రేంజ్‌ లో ప్రపంచానికి చూపించడానికి తన జీవితకాల సంపాదన రూ.4,000 కోట్లను పణంగా పెట్టారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భోగాపురం భోగం ఎవరిది.....

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో...

పోల్స్