Saturday, August 1, 2026 05:35 PM
Saturday, August 1, 2026 05:35 PM

మోడీని దారుణంగా మాట్లాడారు.. పవన్ సంచలన కామెంట్స్..!

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో కొందరు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన అభ్యంతరకర కామెంట్స్‌ పై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ రోజు భోగాపురం బహిరంగ సభ వేదికగా ఆ వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : బెజవాడ అలంకార్ థియేటర్‌ క్రేజీ రికార్డ్..!

“దేశం కోసం అహర్నిశలు కష్టపడే ఒక గొప్ప నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? జంతర్ మంతర్ నిరసనల్లో ప్రధాని మోదీని అనకూడని మాటలు అంటుంటే, ఆ మాటలు విన్న నా మనసు కదిలిపోయింది. నాకు ఎంతో బాధేస్తోంది” అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం నరేంద్ర మోదీ పడ్డంత కష్టం బహుశా మరే నాయకుడూ పడలేదని, కానీ ఆయన పడుతున్న కష్టం నేటి కొత్త తరానికి సరిగ్గా తెలియడం లేదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు.

Also Read : భోగాపురంలో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!

దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు శ్రమిస్తున్న ప్రధానిపై ఇలాంటి అవాకులు చవాకులు పేలడం సరికాదని పవన్ కల్యాణ్ హితవు పలికారు. “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎలాంటి మాట పడినా, అది మా అందరి మీద పడినట్టే భావిస్తాం. ప్రస్తుతం దేశాన్ని నడిపించడంలో మోదీని మించిన నాయకుడు మరొకరు లేరు.. భవిష్యత్తులో రారు కూడా” అంటూ ఆయన స్పష్టం చేశారు. మీరు వద్దంటే వదలాలి కానీ అధికారం మిమ్మల్ని వదిలిపోదు.. మీ వెంట మేం అంతా ఉంటాం అంటూ పవన్.. మోడీని ఉద్దేశించి కామెంట్స్ చేసారు. దేశాన్ని నడిపించడం అంటే రామ కార్యం లాంటిది.. అటువంటి బ్రహత్కార్యం ప్రధాని చేస్తున్నారన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భోగాపురం భోగం ఎవరిది.....

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో...

జనసేనాని ఆన్ డ్యూటీ.....

జనసేనలో రాష్ట్ర అధికార ప్రతినిధుల వ్యవస్థను...

పోల్స్