Sunday, September 13, 2026 01:42 PM
Sunday, September 13, 2026 01:42 PM

నేనేంటో నా భర్తకు తెలుసు: భువనేశ్వరి సంచలన కామెంట్స్

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ముఖ్యంగా మహిళా గౌరవం, సమాజంలో స్త్రీలకు ఉండాల్సిన స్థానంపై మాట్లాడే క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. లోకంలో ఏ ఒక్కరికీ కూడా ఒక స్త్రీని తక్కువ చేసి మాట్లాడే హక్కు గానీ, అవమానించే అధికారం గానీ లేవంటూ ఆమె స్పష్టం చేసారు. ఈ సందర్భంగా ఆమె మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఆనాటి పరిస్థితులను గుర్తుచేశారు.

Also Read : ఒక్క మాటతో పార్లమెంట్ ను షేక్ చేసిన రాహుల్..!

ఆనాడు పాండవులను, భర్తలను మానసికంగా దెబ్బతీయాలనే కుత్సిత బుద్ధితో, ఎలాంటి సిగ్గు లేకుండా కౌరవులు సభాముఖంగా ద్రౌపది చీర లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే తరహా రాజకీయ కక్షసాధింపులు నేటి కాలంలోనూ కొనసాగుతున్నాయని ఆమె ఆరోపించారు. గతంలో అసెంబ్లీ వేదికగా జరిగిన కొన్ని పరిణామాలను ప్రస్తావిస్తూ.. నాడు తన భర్త చంద్రబాబు నాయుడును తీవ్రంగా అవమానపరచాలని కొందరు చూశారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేసారు. సభలో ఆయనను మానసిక క్షోభకు గురిచేసి ఆనందించాలని చూసారని పేర్కొన్నారు.

Also Read : హెచ్-1బీ వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..!

రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఆమె రియాక్ట్ అయ్యారు. “నన్ను నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నేనేంటో నా భర్తకు బాగా తెలుసు” అని భువనేశ్వరి భావోద్వేగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇలాంటి చౌకబారు విమర్శలకు తాను ఎప్పుడూ అధైర్యపడబోనని, తన కుటుంబం, ప్రజల మద్దతు తనకు ఎల్లప్పుడూ ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు. 40 ఏళ్లుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్