Wednesday, July 29, 2026 06:34 AM
Wednesday, July 29, 2026 06:34 AM

ఇక రాష్ట్రాల వైపు ఫోకస్.. ప్రక్షాళన దిశగా అడుగులు..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతంపై కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన సుదీర్ఘ ఆందోళన రాజకీయంగా పెద్ద ప్రకంపనలే సృష్టించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఈ ఉద్యమం దేశ యువత దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. జంతర్ మంతర్ వద్ద దాదాపు 37 రోజుల పాటు నిరసనలు కొనసాగించి చరిత్ర సృష్టించారు. కేంద్ర ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో పారదర్శకత కొరవడిందంటూ రోడ్డెక్కిన ఈ వేదిక ఇప్పుడు రాష్ట్ర స్థాయి పరీక్షల వైపు కూడా దృష్టి పెట్టాలని యువత కోరుతోంది. పంజాబ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాలలోనూ రెక్రూట్‌మెంట్ పరీక్షల పత్రాలు లీకయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర స్థాయిలోనే కాకుండా రాష్ట్రాల విద్యా వ్యవస్థలలో కూడా సంస్కరణలు రావాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రాంతీయ స్థాయిలో కూడా పోరాటాలు చేయాల్సిన బాధ్యత సీజేపీపై పడింది.

Also Read : జగన్ ట్రాప్ లో టీడీపీ నేతలు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

ఇప్పుడు అందరి దృష్టి పంజాబ్ రాష్ట్రంపైనే కేంద్రీకృతమైంది. ఎందుకంటే అక్కడ ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు గ్రూప్ బీ, ఫార్మాసిస్ట్ వంటి కీలక నియామక పరీక్షల ప్రశ్నపత్రాలు బయటికి వచ్చాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్ర మంత్రి రాజీనామా చేసిన మాదిరిగానే పంజాబ్ విద్యాశాఖ మంత్రి కూడా వెంటనే తప్పుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో సీజేపీ ప్రతినిధులు కూడా ప్రస్తుతం రెండు నెలల పోరాటం తర్వాత కొంత విశ్రాంతి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే తమ తదుపరి కార్యాచరణ అధికారికంగా ప్రకటిస్తామని.. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం తమ ప్రయాణం ఆగదని వెల్లడించారు. కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల లోపాలను ఎత్తి చూపేందుకు సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు.

Also Read : ఉమా అసహనానికి కారణం అదేనా..!

తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి అనేక రాష్ట్రాల్లో గతంలో జరిగిన పేపర్ లీకేజీ ఉదంతాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. కేవలం ఒక శాఖపై పోరాడి విజయవంతం అయినంత మాత్రాన సరిపోదని అన్ని రాష్ట్రాల బోర్డులను ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతూ సీజేపీని ఆశ్రయిస్తున్నారు. అయితే రాష్ట్రాల్లో కూడా ప్రత్యక్ష ఆందోళనలు ప్రారంభించాలా వద్దా అనే విషయంపై ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా మధన పడుతోంది. ఇప్పటి వరకు జాతీయ స్థాయి సమస్యలపై పోరాడిన అనుభవం ఉండగా ఇకపై ప్రాంతీయ రాజకీయాలను కూడా ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్తును అస్తవ్యస్తం చేస్తున్న మాఫియాపై ఉక్కుపాదం మోపేలా నిరసనల రూపురేఖలను మార్చాలని భావిస్తున్నారు.

Also Read : బెజవాడ పాలిటిక్స్ మళ్ళీ ఇంట్రస్టింగ్ చర్చ..!

అయితే ఈ పరిణామాలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఎలాంటి లీకేజీలు జరగలేదని ఖండించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిందని.. ఒక్క ప్రశ్నాపత్రం కూడా లీక్ కాలేదని స్పష్టం చేశారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు బ్లూటూత్ పెన్నులను ఉపయోగించి డిజిటల్ పద్ధతిలో కాపీయింగ్ చేసేందుకు కుట్ర పన్నారని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన కేవలం పది నిమిషాల్లోనే ఈ మోసాన్ని పసిగట్టిన అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఒక్కో పేపర్‌కు మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తూ బయటి నుంచి ఈ కుట్రను నడిపిస్తున్న సూత్రధారులను పట్టుకున్నామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 21 మంది నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.

సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఎక్స్ వేదికగా ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమేనని తేల్చిచెప్పారు. తమ ప్రయాణం ముగియలేదని ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వరకు విద్యా వ్యవస్థలో సంస్కరణలు వచ్చే వరకు తమ పోరాటం నిరంతరం సాగుతూనే ఉంటుందని దీప్కే స్పష్టం చేశారు. కేవలం ఒక పదవి నుంచి మంత్రి దిగిపోవడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదని పరీక్షల నిర్వహణ పద్ధతులు పూర్తిగా మారాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న మద్దతు.. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఢిల్లీ కేంద్రంగానే కాకుండా దేశంలోని ప్రతి మూలకు ఈ విప్లవాన్ని తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం నిరససలకే పరిమితమైన ఈ వేదిక ఇప్పుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది. ఏది ఏమైనప్పటికీ విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలనే నినాదం దేశవ్యాప్తంగా యువతను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అల్లు అర్జున్ సంచలన...

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

జగన్ ట్రాప్ లో...

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం...

మేమూ బాధితులమే.. తమ్మినేని...

భూ వ్యవహారానికి సంబందించి తన కుటుంబ...

రంగనాథ్‌ను తొలగిస్తారా.. లేక...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

జగన్ రెస్పాండ్ అవుతారా.?...

ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి, విపక్షం...

రామాలయానికి తొలగిన అడ్డంకి..!

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ...

పోల్స్