Wednesday, July 29, 2026 06:03 AM
Wednesday, July 29, 2026 06:03 AM

ఉమా అసహనానికి కారణం అదేనా..!

బోండా ఉమామహేశ్వర్రావు.. ఇటీవల తరచూ వినిపిస్తున్న పేరు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ కాలంలోనే కీలక పదవులు అనుభవించారు. మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన బోండా ఉమా.. రెండుసార్లు గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌ పదవి దక్కింది. పరిటాల రవి చనిపోయిన తర్వాత టీడీపీ అనంతపురం ఇన్‌చార్జ్‌గా, ఆ తరువాత టీడీపీ అధికార ప్రతినిధిగా, టీడీపీ ఉపాధ్యక్షుడిగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు.

Also Read : జగన్ రెస్పాండ్ అవుతారా.? లోకేష్ కామెంట్స్ కు అదిరిపోయే రెస్పాన్స్..!

కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమా.. 2004లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. అనతికాలంలోనే విజయవాడలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో 2009లో విజయవాడ తూర్పు నియోజకవర్గ టికెట్ కూడా కేటాయించారు చంద్రబాబు. అయితే అనూహ్యంగా జరిగిన పరిణామాల వల్ల చివరి నిమిషంలో ఆ టికెట్‌ను గద్దె రామ్మోహన్‌రావుకు ఇచ్చారు. ఇక నియోజకవర్గాల పునర్ విభజనలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నూతనంగా ఏర్పడటంతో.. బోండా ఉమాకు సెంట్రల్ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బోండా ఉమా.. వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డిపై 27 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత అసెంబ్లీలో జరిగిన ఓ చర్చ సమయంలో బోండా ఉమా నాటి ప్రతిపక్ష నేతలపై నోరు పారేసుకున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

Also Read : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల జోరు..!

విజయవాడకు చెందిన కాపు నేత కావడం.. బోండా ఉమకు టీడీపీ అధినేత అధిక ప్రాధాన్యత ఇచ్చారు. టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించారు. అలాగే పార్టీ అత్యున్నత పదవి పొలిట్ బ్యూరో సభ్యునిగా అవకాశం ఇచ్చారు. ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ.. మంత్రి పదవి ఇవ్వలేదంటూ తన కార్యాలయంలో నిరసన చేపట్టారు. చివరికి నాటి టీడీపీ ఎంపీ కేశినేని నాని స్వయంగా ఉమా కార్యాలయానికి వెళ్లి బుజ్జగించాల్సి వచ్చింది. ఆ సమయంలోనే సామాజిక వర్గం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బోండా ఉమ. 2019 ఎన్నికల్లో ఓడిన బోండా ఉమ.. వైసీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. మాచర్ల పర్యటనకు వెళ్లిన బోండా ఉమపై వైసీపీ నేత తురగా కిషోర్ హత్యాయత్నం చేశాడు. కారు అద్దాలు పగలగొట్టి.. కర్రలు, కత్తులతో దాడికి యత్నించారు. ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ఉమ.. నాటి వైసీపీ నేతలపై ఒంటికాలిపై దూకారు కూడా.

Also Read : రామాలయానికి తొలగిన అడ్డంకి..!

2024లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమ.. తన సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి, వై‌సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ పై ఏకంగా 68,886 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత శాసనసభలో విప్‌గా కొనసాగుతున్నారు. పార్టీ ఎన్ని పదవులు ఇచ్చినా కూడా.. బోండా ఉమాలో మాత్రం అసంతృప్తి పోలేదు. మంత్రి పదవి కావాలనే కోరిక అలాగే ఉంది. సామాజిక సమీకరణలు, వ్యక్తుల ప్రవర్తన, ఇతర కారణాల వల్ల బోండా ఉమకు పదవి రాలేదు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ఉమ.. ఇటీవల పార్టీ అధినేతను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులని.. కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు లేదన్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసిన ఉమ.. రోజూ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకున్నారు. ఆయనతో సరదాగా మాట్లాడుతున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అయితే బోండా ఉమా టీడీపీని టార్గెట్ చేయడానికి.. వైసీపీ నేతలకు దగ్గరవ్వడానికి కారణాలేమిటనే విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. 2029 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు బోండా ఉమను మరో చోటకు మార్చే అవకాశం ఉంది. లేదా నామినేటెడ్ పదవితో సరిపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవకాశం లేదు. అదేదీ కాదంటే.. ప్రస్తుతం దేవినేని ఉమాను పక్కన పెట్టినట్లు పెడతారనే భయం కూడా బోండా అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. పోనీ జనసేన నుంచి పోటీ చేద్దామనుకుంటే.. పవన్ అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. పవన్‌కు బోండా చర్యలు కోపం తెప్పించాయి. కాబట్టి సీటు రాదంటున్నారు.

అందుకే ఇప్పటి నుంచే మెల్లగా పార్టీ నుండి దూరం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇండిపెండెంట్‌గా తన చరిష్మా పెంచుకునే దిశగా ప్రణాళిక కనిపిస్తుంది. వైసీపీ నుంచి విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో చాలా గట్టి పోటీ ఉంది. వైసీపీ నుంచి మల్లాది విష్ణుతో పాటు డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి భర్త ఆరిగ శ్రీనివాసరెడ్డి, అడపా శేషు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీలో మాత్రం బోండా ఉమా తర్వాత ఆ స్థాయి నాయకులు కనిపించటం లేదు. జనసేన పార్టీ నుంచి వంగవీటి రాధ పోటీ చేస్తారనే ప్రచారం వినిపిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే అధినేతపై బోండా ఉమామహేశ్వరరావు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అల్లు అర్జున్ సంచలన...

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

జగన్ ట్రాప్ లో...

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం...

మేమూ బాధితులమే.. తమ్మినేని...

భూ వ్యవహారానికి సంబందించి తన కుటుంబ...

రంగనాథ్‌ను తొలగిస్తారా.. లేక...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

జగన్ రెస్పాండ్ అవుతారా.?...

ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి, విపక్షం...

రామాలయానికి తొలగిన అడ్డంకి..!

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ...

పోల్స్