Sunday, September 13, 2026 05:39 PM
Sunday, September 13, 2026 05:39 PM

ఏపీ రైతులను ఆశ పెడుతున్న వాయి గుండం..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన కొన్ని గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 3 కిలోమీటర్ల నెమ్మదిగా కదులుతూ, తీవ్ర రూపం దాల్చి నేడు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు పశ్చిమ బెంగాల్‌ లోని సాగర్ ఐలాండ్ – ఒడిశాలోని బాలాసోర్ మరియు కౌనింగ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read : 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ.. అసెంబ్లీలో తీర్మానం..!

ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ లోని ఉత్తరాంధ్ర జిల్లాలపై వాతావరణ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాబోయే 24 నుండి 48 గంటల పాటు ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒడిశా సరిహద్దును ఆనుకుని ఉన్న కొన్ని లోతట్టు ప్రాంతాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు.

Also Read : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా..!

తీరం దాటే సమయంలో సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు మరియు ప్రచండ మారుతాలు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, లోతట్టు మరియు తీర ప్రాంత గ్రామాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Also Read : అధిష్ఠానం నోటీసులపై ఎమ్మెల్యే బోండా ఉమ హాట్ కామెంట్స్..!

సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో ఏపీ వాతావరణ శాఖ మత్స్యకారులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్ళరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే వేట కోసం సముద్రంలోకి వెళ్లిన బోట్లు మరియు మత్స్యకారులు తక్షణమే సమీపంలోని సురక్షిత రేవులకు లేదా తీర ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత పోర్టులలో కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్