Sunday, September 13, 2026 06:34 PM
Sunday, September 13, 2026 06:34 PM

సీమకు మరో బంపర్ ఆఫర్..!

రాయలసీమకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్..కీలకమైన రైల్వే కనెక్టివిటీకి ఆమోదముద్ర వేసింది. ఏపీలోని గుంతకల్లు నుంచి కర్ణాటకలోని బళ్లారి వరకు 46 కిలోమీటర్ల మేర 3వ, 4వ అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి రూ. 1,264 కోట్ల అంచనా వ్యయాన్ని కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ విస్తరణ ప్రాజెక్ట్‌లో భాగంగా వేదవతి నదిపై ఏకంగా 762 మీటర్ల భారీ వంతెనతో పాటు పలు ప్రధాన వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు.

Also Read : భారత్ కు షాక్ ఇచ్చిన ట్రంప్..!

ఈ అదనపు రైల్వే లైన్ల రాకతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య ప్రయాణికుల రాకపోకలతో పాటు సరకు రవాణాలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. గుంతకల్లు-బళ్లారి మార్గంలో నిత్యం ఎదురయ్యే రద్దీకి చెక్ పడటంతో పాటు రైళ్ల రాకపోకల వేగం గణనీయంగా పెరగనుంది. ఈ డబుల్ డెవలప్‌మెంట్‌తో ఏటా అదనంగా 1.60 కోట్ల టన్నుల సరకు రవాణా చేసే వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సమృద్ధిగా ఉండే ఇనుప ఖనిజం, బొగ్గు, సిమెంట్, సున్నపురాయి మరియు ధాన్యాల రవాణా వేగవంతమై, రీజనల్ ఇండస్ట్రియల్ గ్రోత్‌కు, అలాగే ప్రధాన ఓడరేవులతో పోర్ట్ కనెక్టివిటీకి ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకంగా మారనుంది.

Also Read : రామాయణ ట్రైలర్ ఏమైంది..? హాలీవుడ్ రేంజ్‌ కోసమే ఆపారా..?

కేవలం ఈ ఒక్క రైల్వే విస్తరణ ప్రాజెక్టు ద్వారానే నిర్మాణ దశలో దాదాపు 31 లక్షల పని దినాల ఉపాధి లభించనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాయలసీమ ప్రాంత ప్రగతికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, స్థానిక ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్