Friday, July 24, 2026 07:21 PM
Friday, July 24, 2026 07:21 PM

కాక్రోచ్ డిమాండ్.. అంతటితో ఆగుతుందా..?

ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. చివరికి గతంలో ఎన్నడూ లేనంతగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సెల్ఫీ వీడియో చేసి.. దానిని అర్థరాత్రి 11.52 గంటలకు తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, పోలీసుల లాఠీఛార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్.. వీటితోనే జంతర్ మంతర్ అట్టుడుకుతోంది. ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్.. అవసరమైన వైద్య సాయం.. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు సాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరికీ తల వంచని మోదీ సర్కార్.. తొలిసారి ఒక మెట్టు దిగిందనే చెప్పాలి. కేంద్ర మంత్రులు నేరుగా ఆసుపత్రికి వెళ్లి నిరాహర దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్‌తో చర్చలు జరిపారు. ఇక ప్రధాని మోదీ అయితే.. నీట్ పేపర్ లీకేజ్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కేంద్ర మంతివర్గ సమావేశంలో దీనిపై మరోసారి చర్చించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కూడా.

Also Read : ఎన్నికల సందడి షురూ.. ఎవరి లెక్కలు వారివి..!

అయితే కాక్రోచ్ జనతా పార్టీ.. సీజేపీ డిమాండ్ మాత్రం ఒకటే. ఇంకా చెప్పాలంటే తొలి నుంచి ఇదే డిమాండ్‌తో సీజేపీ ఆందోళనలు చేస్తోంది. అదే కేంద్ర మంత్రివర్గం నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజ్ వల్ల 20 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఇదే అవకాశంగా భావించిన కాంగ్రెస్ సహా విపక్షలు కూడా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అయితే.. పార్లమెంట్ మెట్ల మీదే.. ధర్మేంద్ర ప్రధాన్‌ ఎదురుగానే.. “వరస్ట్ గవర్నమెంట్.. షేమ్ ఆన్ యూ..” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత ఆందోళనలు టార్గెట్ ధర్మేంద్ర ప్రధాన్ అన్నట్లుగా సాగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా ఆయన వ్యవహరిస్తున్న తీరును ఉదాహరిస్తున్నారు. నీట్‌ పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థుల జీవితాలతో ప్రధాన్ ఆడుకున్నారని ఆరోపిస్తున్నారు. కేంద్ర విద్యా శాఖా మంత్రిగా ఉన్న ప్రధాన్.. ఇక్కడి విద్యా వ్యవస్థపై నమ్మకం లేకనే.. తన కుమార్తెను విదేశాల్లో చదివిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఇక్కడ లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ధర్మేంద్ర ప్రధాన్.. తన కుమార్తె నైమిషా ప్రధాన్‌ను మాత్రం విదేశాల్లో చదివిస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో నైమిషా‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు వెల్లువెత్తడంతో.. చివరికి ఆమె తన అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. అయితే దీనికి కారణం ఇదీ అని మాత్రం వెల్లడించలేదు.

Also Read : ఉండి వైసీపీలో మంటలు.. జగన్ వైఖరితో చిచ్చు..!

ఇక ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామాకు కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తుందనే ప్రశ్నకు కాషాయ పార్టీ పెద్దల నుంచి సమాధానం లేదు. నీటి పేపర్ లీక్ నిజం. ఇందుకు సంబంధిత శాఖ మంత్రి బాధ్యత వహించాల్సిందే. అలా అని ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తే.. మోదీ సర్కార్ తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది కదా అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఎక్కడో, ఎవరో చేసిన లీక్‌ కారణంగా కేంద్ర మంత్రిని తొలగిస్తే.. రేపు మరో అంశంపై ఆరోపణలు వస్తే.. అప్పుడు మరో మంత్రిని తొలగించాలని డిమాండ్ వస్తుంది కదా.. అనేది కాషాయ పార్టీ నేతల మాట. పేపర్ లీక్ అసలు దొంగలు ఎవరో తేలకుండా.. కేంద్ర మంత్రి రాజీనామాకు పట్టుబట్టడం ఎంత వరకు సమంజసం అనేది మరో ప్రశ్న. దర్యాప్తులో కేంద్ర మంత్రి తప్పుచేసినట్లు తెలిస్తే.. అప్పుడు తప్పకుండా చర్యలుంటాయంటున్నారు కమలం పార్టీ నేతలు. అయితే వడ్డించేవాడు మనవాడు అయినప్పుడు.. అనే సామెత మాదిరిగా.. దర్యాప్తు జరిపేది కేంద్రం ఆధీనంలో సంస్థ.. అప్పుడు కేంద్ర మంత్రి పేరు ఎలా ఉంటుందనేది ఆందోళనకారుల ప్రశ్న.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా...

సీదిరి అప్పలరాజు రిమాండ్...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

టీడీపీ నేతలకు చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌ లో అధికార తెలుగుదేశం పార్టీ...

తల్లికి వందనం షురూ.....

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి...

జక్కంపూడికి మూడిందా..? అరెస్ట్...

రాజమహేంద్రవరం కేంద్రంగా వైసీపీ కీలక నేత,...

యుద్ధం కొనసాగితే 9/11...

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు...

పోల్స్