నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలలో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో ఒక కీలకమైన ఫైట్ సీక్వెన్స్ తీస్తుండగా బాలకృష్ణ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్న చిత్ర యూనిట్ సభ్యులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కిందపడటంతో బాలయ్య మోకాలికి స్వల్ప గాయమైంది. ఆయన నడవడానికి ఇబ్బంది పడటంతో సెట్స్ లో తీవ్ర కలకలం రేగింది.
Also Read : ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఆర్ఎస్‌కే..!
వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం షూటింగ్ ను నిలిపివేసి.. అనంతరం బాలకృష్ణను కాకినాడలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించింది. మోకాలి లోపల ఏమైనా అంతర్గత గాయాలు లేదా ఫ్రాక్చర్లు ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి వైద్యులు ఆయనకు అత్యవసరంగా ఎక్స్-రే మరియు ఇతర మోకాలి స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి దెబ్బ స్వల్పమైనదేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రాథమిక సమాచారం అందుతోంది.
Also Read : పట్టు వదలని కాక్రోచ్ లు.. నేడు కూడా..!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 111వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కాకినాడ పోర్టులో గత కొన్ని రోజులుగా హై-వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్ నడుస్తోంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని అత్యంత కీలకమైన మరియు క్లైమాక్స్ తరహా ఫైట్ సీన్లను ఎంతో గ్రాండ్ గా డిజైన్ చేసి తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో మరియు టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రత్యేకమైన యాక్షన్ సన్నివేశాలలో బాలకృష్ణతో పాటు యంగ్ హీరో మంచు మనోజ్ కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్, బాలయ్య మధ్య తీవ్రమైన ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది.

