Tuesday, July 21, 2026 08:30 PM
Tuesday, July 21, 2026 08:30 PM

పరారీలో తమ్మినేని.. పరుగో పరుగు..!

అధికారంలో ఉన్న ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ అధినేతపై ఒంటికాలిపై రంకెలేసిన నేత.. ఇప్పుడు అర్థరాత్రి వేళ సైలెంట్‌గా దొడ్డి దారి నుంచి పరారయ్యాడనే వార్త.. పెద్ద దుమారం రేపుతోంది. వైసీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. అధికారం అండతో అధికారులను, పోలీసులను పరుగులు పెట్టించిన తమ్మినేని.. ఇప్పుడు అదే పోలీసుల దెబ్బకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మనిషి బతికుండగానే చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసిన కేసుతో పాటు భూమి ఆక్రమణ కేసు, ఫేక్ రిజిస్ట్రేషన్ కేసు కూడా ఇప్పుడు తమ్మినేనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

Also Read : ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఆర్ఎస్‌కే..!

తమ్మినేని సీతారాం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శ్రీకాకుళం జిల్లా చాపురం పంచాయతీ బలగ పరిధిలో సుమారు రూ.4 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు తమ్మినేని సీతారాం కుట్రలు చేశారనేది ప్రధాన ఆరోపణ. భూ యజమాని బతికుండగానే.. ఆయన చనిపోయినట్లు ఓ ఫేక్ డెత్ సర్టిఫికేట్ తయారు చేశారు. తర్వాత ఆ భూమికి వారసురాలిగా ఒడిశాకు చెందిన ఓ మహిళను తెరపైకి తీసుకువచ్చారు. ఆమె నుంచి తమ్మినేని కుటుంబం కొన్నట్లుగా నకిలీ లావాదేవీలు సృష్టించారు. ఆ భూమిని తమ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఇదంతా స్పీకర్‌ పదవిని అడ్డుపెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు.

Also Read : మంగళగిరిలో లోకేష్ మార్క్.. మాట నిలబెట్టుకున్న మంత్రి..!

ఫేక్ సర్టిఫికేట్, భూ కబ్జా కేసులను పోలీసులు నమోదు చేయడంతో పాటు ఇప్పటికే పలువురిని అరెస్టు కూడా చేశారు. ఈ కేసులో తమ్మినేని సీతారాంతో పాటు భార్య తమ్మినేని వాణి, కుమారుడు చిరంజీవి నాగ్ కూడా నిందితులుగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ ఇప్పటికే వెల్లడించారు. దీంతో తమ అరెస్టు ఖాయమని భావించిన తమ్మినేని.. సైలెంట్‌గా పారిపోయారు. తనకు సొంతంగా రెండు కార్లు ఉన్నప్పటికీ.. అద్దె కారులో అర్థరాత్రి 3 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. తమ లొకేషన్ ట్రేస్ చేస్తారనే భయంతో ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. విస్తృత గాలింపు చేపట్టారు. ఇప్పటికే అన్ని చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆముదాలవలస నుంచి ఒడిశా వైపు వెళ్లినట్లు సన్నిహితులు చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం.. విశాఖ లేదా హైదరాబాద్ నగరాల్లో తమ్మినేని తలదాచుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి వాడెంత, వీడెంత అంటూ విర్రవీగిన తమ్మినేని.. ఇప్పుడు ఇలా దొడ్డి దారిన దొంగల పారిపోవడం ఏమిటని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్