Tuesday, July 21, 2026 08:40 PM
Tuesday, July 21, 2026 08:40 PM

రిటైర్మెంట్ రూమర్లపై రోహిత్ సంచలన కామెంట్స్..!

ఇంగ్లాండ్‌ తో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌పై వస్తున్న పుకార్లకు ఘాటుగా సమాధానమిచ్చాడు. మైదానం వెలుపల వచ్చే ఇలాంటి విమర్శలు, పుకార్లు తన ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేసాడు. లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగినప్పటికీ, భారత్ ఈ మ్యాచ్‌ తో పాటు సిరీస్‌ ను కూడా కోల్పోవాల్సి వచ్చింది.

Also Read : కాక్రోచ్ దెబ్బకు దిగివచ్చిన కేంద్ర సర్కార్..!

రిటైర్మెంట్ రూమర్లపై బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “నా పని కేవలం బ్యాట్‌ తో రాణించడమే. దేశం తరఫున, జట్టు తరఫున అత్యుత్తమంగా ఆడటమే నాకు తెలుసు. నేను అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇలాంటి మాటలు వింటూనే ఉన్నాను, నేను ఉన్నంత కాలం ఇవి వస్తూనే ఉంటాయి. అందుకే బయట జరిగే ప్రచారాన్ని నేను పెద్దగా పట్టించుకోను” అని స్పష్టం చేసాడు. క్రికెట్‌ లో విమర్శలు, చర్చలు సహజమని పేర్కొంటూ రోహిత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.

Also Read : మంగళగిరిలో లోకేష్ మార్క్.. మాట నిలబెట్టుకున్న మంత్రి..!

“మైదానంలో నా ప్రదర్శన ద్వారా జట్టు విజయానికి ఎంతవరకు సహకరించాననేదే నాకు ముఖ్యం. ప్రస్తుతం నా ఫోకస్ అంతా దానిపైనే ఉంది. బయట ఎంత గొడవ జరిగితే అంత మజా ఉంటుంది. ఒకవేళ ఆ నాయిస్ లేకపోతే అసలు కిక్కే ఉండదు. నా పని గ్రౌండ్ లోపల, వారి పని గ్రౌండ్ వెలుపల” అంటూ హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. మూడో వన్డేతో రోహిత్ కెరీర్ ముగిసిపోతుందంటూ సాగిన ప్రచారానికి తన బ్యాట్‌ తోనే బలమైన సమాధానం ఇచ్చాడు రోహిత్. కేవలం 110 బంతుల్లోనే 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేసి చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన మొదటి భారత బ్యాటర్‌ గా రికార్డు సృష్టించాడు. ఇది రోహిత్ శర్మ వన్డే కెరీర్‌ లో 34వ సెంచరీ కావడం విశేషం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్