నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులన్నీ షేక్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అఖండ నుండి అఖండ సీక్వెల్ వరకు వరుస విజయాలతో కలెక్షన్ల వర్షం కురిపించిన బాలయ్య, ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ చిత్రంలో నటిస్తున్నారు. పూర్తి మాఫియా బ్యాక్ డ్రాప్ లో, హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతుండగానే, తాజాగా ట్రేడ్ వర్గాలను విస్తుపోయేలా చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ అప్పుడే క్లోజ్ అయిపోయినట్లు సమాచారం.
Also Read : ఎంపీలకు షాక్ ఇచ్చిన స్పీకర్..!
ప్రస్తుతం మార్కెట్‌లో పెద్ద సినిమాలకు కూడా ఓటీటీ బిజినెస్ క్లిష్టంగా మారిన తరుణంలో, ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫారమ్ జీ5 ఈ చిత్ర డిజిటల్ హక్కులను ఊహించని రేటుకు సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దాదాపు 50 కోట్లకు పైగా భారీ ఫ్యాన్సీ రేటు చెల్లించి జీ5 ఈ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్ర యూనిట్, థియేట్రికల్ రిలీజ్ కు ముందే కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే సగానికి పైగా బడ్జెట్‌ను రికవరీ చేసి సేఫ్ జోన్ లోకి వచ్చేలా ప్లాన్ చేసుకుంది.
Also Read : టీటీడీ కీలక సమాచారం లీక్..? అసలేం జరిగింది..?
బాలయ్య-థమన్ కాంబినేషన్ అనగానే రీ-రికార్డింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే, అందుకే జీ5 సంస్థ కూడా అడిగినంత రేటు ఇచ్చి మరీ డీల్ ఓకే చేసుకుందట. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ నగర్ లో ఒక క్రేజీ గాసిప్ కూడా వినపడుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ పాత్ర కేవలం పాటలకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక పవర్ ఫుల్ అండర్‌కవర్ రోల్ లో కనిపించబోతోందని ఇండస్ట్రీ టాక్. అంతేకాకుండా, సినిమా ద్వితీయార్థంలో వచ్చే ఒక కీలకమైన ట్విస్ట్ లో కాజల్ క్యారెక్టరే హైలైట్ అవుతుందని, బాలయ్యతో మైండ్ గేమ్ ఆడే విలనిజం షేడ్స్ ఉన్న పాత్ర ఇదంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా థియేట్రికల్, శాటిలైట్ బిజినెస్ ఇంకా ఓపెన్ కాకముందే కేవలం డిజిటల్ రైట్స్‌తోనే రూ. 50 కోట్లు సాధించడం బాలయ్య బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనమని చెప్పాలి.

