Thursday, July 16, 2026 11:59 PM
Thursday, July 16, 2026 11:59 PM

ఫౌజీ క్లైమాక్స్ పిచ్చి ఎక్కిపోవడమే.. ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్..!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బ్యాక్-టు-బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ విడుదల తేదీపై చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఒక అధికారిక స్పష్టత ఇచ్చింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ను 2026, డిసెంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Also Read : స్టార్ హీరో మూడో పెళ్లిపై మతం రచ్చ.. అసలేం జరిగింది..?

ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో అప్పుడే పండుగ వాతావరణం నెలకొంది. ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ గాసిప్ విపరీతంగా హల్చల్ చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ ఆర్మీ బ్యాక్‌డ్రాప్ స్టోరీలో ప్రభాస్ రెండు విభిన్నమైన గెటప్స్‌ లో కనిపించబోతున్నాడని సమాచారం. అంతేకాకుండా, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌లో వచ్చే ఒక ఊహించని ట్విస్ట్ మరియు ప్రభాస్ క్యారెక్టరైజేషన్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు.

Also Read : ఎంపీలకు షాక్ ఇచ్చిన స్పీకర్..!

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తున్న కొత్త కథానాయిక ఇమాన్ ఇస్మాయిల్ పాత్ర కూడా కేవలం గ్లామర్‌ కే పరిమితం కాకుండా, బ్రిటీష్ కాలం నాటి కథను మలుపు తిప్పే ఒక పవర్‌ ఫుల్ రోల్‌ లో కనిపించనుందని టాక్. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎమోషన్స్‌ ను పండించడంలో దిట్ట అయిన హను రాఘవపూడి, ఈ చిత్రాన్ని గతంలో ఎన్నడూ చూడని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన కొన్ని ట్యూన్స్ ఇండస్ట్రీలో భారీ అంచనాలను పెంచేశాయి. డిసెంబర్ 3న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అవి అక్రమ కేసులే.....

ఏపీలో జగన్‌ హయాంలో గతంలో ఎన్నడూ...

గల్లా జయదేవ్ కు...

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో...

పోలవరం-బనకచర్ల వివాదం.. తెలంగాణ...

తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా...

ఏపీలో ఎన్నికల సందడి.....

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

టీటీడీ కీలక సమాచారం...

తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ విభాగం...

రేవంత్ కు పవన్...

తెలంగాణలోని షాద్‌ నగర్‌ లో పోక్సో...

పోల్స్