Saturday, July 11, 2026 06:36 PM
Saturday, July 11, 2026 06:36 PM

పోలీసులకు పిచ్చి ఎక్కిస్తున్న కేతన్ కేసు.. ప్రూవ్ చేయడం కష్టమేనా..?

మొదట అదొక సాధారణ ట్రెకింగ్ ప్రమాదం అని అంతా అనుకున్నారు. కానీ, తీగ లాగితే డొంక కదిలినట్లు.. 26 ఏళ్ల యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి వెనుక ఉన్న భయంకరమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి పక్కా స్కెచ్‌ తో కేతన్‌ ను పూణేలోని లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టి చంపేశారనే ఆరోపణలతో ఇరువూ అరెస్టయ్యారు. అయితే, ఈ కేసు మీడియా హెడ్‌ లైన్స్‌ లో నిలిచినంత సులువుగా కోర్టులో నిరూపించడం సాధ్యం కాదని, పోలీసుల ముందు ఒక పెద్ద సవాల్ ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also Read : ఆ ముగ్గురి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..!

ప్రస్తుతం నిందితులు ఇద్దరూ పోలీసుల వద్ద నేరాన్ని అంగీకరించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, భారతీయ చట్టాల ప్రకారం పోలీస్ కస్టడీలో చెప్పే మాటలకు కోర్టులో పెద్దగా విలువ ఉండదు. పైగా ఈ కేసులో ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు లేరు. పూర్తి కేసు కేవలం పరిస్థితుల ఆధారిత సాక్ష్యాల చుట్టూనే తిరుగుతోంది. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 నాటి ఆరుషి తల్వార్ కేసు తరహాలోనే.. ఈ కేసులో కూడా ఒక్క సాక్ష్యాల లింక్ తెగినా నిందితులకు లాభం చేకూరే అవకాశం ఉందని ప్రముఖ క్రిమినల్ లాయర్లు గుర్తు చేస్తున్నారు.

Also Read : అంతా ఓపెన్.. రావణ్‌కు జగన్ మద్దతు..!

కేతన్ ప్రమాదవశాత్తు జారిపడ్డాడా..? లేక కావాలనే నెట్టేశారా..? అనే పాయింట్‌ను పోలీసులు శాస్త్రీయంగా నిరూపించాల్సి ఉంది. కేతన్ కిందపడిన చోట ఉన్న రాతి వాలు, అతని పాదరక్షలు, శరీరంపై ఉన్న గాయాలు, మరియు వారిద్దరి ఫోన్ లొకేషన్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు ఈ కేసులో అత్యంత కీలకంగా మారనున్నాయి. హత్య జరిగిన తర్వాత నిందితులు ప్రవర్తించిన తీరు, చాట్‌ లను డిలీట్ చేయడం వంటి అంశాలు పోలీసులకు అదనపు బలాన్ని ఇస్తున్నప్పటికీ.. కోర్టులో పక్కా ఆధారాలు చూపిస్తేనే ఈ కిరాతకులకు శిక్ష పడుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ ముగ్గురి చుట్టూ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్...

కఫ్ సిరప్‌లపై కేంద్రం...

భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్‌లు,...

కొరియా స్టాక్ మార్కెట్‌ను...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి...

అంతా ఓపెన్.. రావణ్‌కు...

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న...

దూకుడు పెంచిన కవితక్క.....

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.....

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా...

పోల్స్