Saturday, October 10, 2026 09:05 AM
Saturday, October 10, 2026 09:05 AM

ఏపీలో మన మిత్ర సరికొత్త చరిత్ర..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవల సరళీకరణలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆధునిక సాంకేతికతను, కృత్రిమ మేధను మేళవించి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వేదికగా సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరతీసింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, ప్రజల మునివేళ్లపైనే యావత్ పాలనా వ్యవస్థను ఉంచాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఏకంగా 1,126 సేవలను ఒకే ఒక్క వాట్సాప్ చాట్‌ బాట్ పరిధిలోకి తీసుకువచ్చింది.

Also Read : ఎల్‌నినో ఎఫెక్ట్.. రెడ్ లిస్ట్‌లో రాయలసీమ..!

గతంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసమో, సంక్షేమ పథకాల వివరాల కోసమో సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా మన మిత్ర డిజిటల్ సదుపాయం ద్వారా పౌరులు తమ మొబైల్ నుంచే నేరుగా సేవలను అందుకుంటున్నారు. ఏఐ ఆధారిత చాట్‌ బాట్ సాంకేతికతతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు సులభంగా తమకు కావలసిన సర్టిఫికేట్లను డౌన్‌ లోడ్ చేసుకోవడంతో పాటు, వివిధ రకాల అప్లికేషన్లను కూడా పూర్తి చేయగలుగుతున్నారు.

Also Read : ఇంగ్లండ్ చేతిలో భారత్ చిత్తు

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ మన మిత్ర సేవలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు సుమారు 58.2 లక్షల మందికి పైగా పౌరులు ఈ డిజిటల్ సేవలను ఉపయోగించుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, ఇప్పటివరకు 3.42 కోట్లకు పైగా డిజిటల్ సెషన్లు నమోదవ్వడం ఈ ప్లాట్‌ ఫారమ్ యొక్క విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా, రియల్ టైమ్ గవర్నెన్స్ మరియు సంక్షేమ పథకాల డెలివరీని మరింత వేగవంతం చేయడానికి ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ దోహదపడుతోంది. రానున్న రోజుల్లో వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకునేలా ఈ వ్యవస్థను మరింతగా విస్తరించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్