Tuesday, July 7, 2026 07:10 PM
Tuesday, July 7, 2026 07:10 PM

సీఐ నాగరాజును వెంటాడుతున్న పాపాలు.. మరో సంచలన కేసు..!

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు మరింత ముమ్మరమైంది. కృష్ణలంక పూర్వ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు వేధింపుల వల్లే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వేగంగా స్పందించారు. ఈ క్రమంలోనే నిందితుడైన సీఐ నాగరాజుపై కృష్ణలంక పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గతంలో ఈ ఘటనపై నమోదైన అనుమానాస్పద మృతి కేసును అధికారులు పరిశీలించారు.

Also Read : ఆ సినీయర్‌ను నమ్మించి మోసం చేసిన జగన్..!

దర్యాప్తులో తేలిన ప్రాథమిక అంశాల ఆధారంగా కేసులో కీలకమైన అదనపు సెక్షన్లను చేర్చారు. సీఐ నాగరాజుపై ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కూడా నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోను దర్యాప్తు బృందం అత్యంత కీలక ఆధారంగా పరిగణిస్తోంది. “నా చావుకు సీఐ నాగరాజే కారణం” అంటూ క్రాంతికుమార్ ఆ వీడియోలో పేర్కొన్న వివరాలపై నిశితంగా పరిశీలిస్తున్నారు.

Also Read : నాడు లేవని నోళ్ళు ఇప్పుడెందుకు లేస్తున్నాయి..?

ఈ కేసులో సాంకేతిక సాక్ష్యాలను పటిష్టం చేసేందుకు గానూ, బాధితుడి మొబైల్ ఫోన్‌ ను స్వాధీనం చేసుకుని, దానిని ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ప్రస్తుతం నార్త్ ఏసీపీ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని కోణాల్లోనూ ఆధారాలను సేకరిస్తోంది. కాల్ డేటా, ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాలు మరియు మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసుకుని విచారణను వేగవంతం చేశారు. చట్టపరంగా నిందితుడికి కఠిన శిక్ష పడేలా పక్కా సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో పోలీసులు చార్జ్‌షీట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్