Monday, July 6, 2026 05:49 PM
Monday, July 6, 2026 05:49 PM

వైసీపీ టూ బీజేపీ.. మార్పుల వేళాయే..!

ఏపీ ఫై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ చేరికలను పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ బాధ్యతను అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు హై కమాండ్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన సైతం బీజేపీలో చేరికలు పెరుగుతాయని ప్రకటించడంతో ఏదో జరుగుతుందన్న అనుమానం ప్రారంభం అయింది. ప్రధానంగా వైసీపీలో ఉన్న అసంతృప్త నాయకులను, ద్వితీయ శ్రేణి క్యాడర్‌ను బీజేపీలోకి రప్పించేందుకు ఎంపీ సీఎం రమేష్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మొన్ననే ఆయన పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను బీజేపీ వైపు తిప్పడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే ఇప్పుడు ఏపీ బాధ్యతలను ఆయనకు హై కమాండ్ అప్పగించినట్లు తెలుస్తోంది.

Also Read : నా దగ్గర ఏనుగు దంతాలున్నాయి: మోహన్ లాల్ సంచలనం..!

జనసేనలో ఇప్పటికే చేరికల కమిటీ ఏర్పాటు అయింది. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే అని తెలుస్తోంది. కూటమిలోని జనసేన, భారతీయ జనతా పార్టీలతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. టీడీపీ కిందిస్థాయి నుంచి బలమైన ఓట్ బ్యాంకు కూడా ఉంది. కానీ జనసేన, బీజేపీ పరిస్థితి వేరుగా ఉంది. అందుకే ఆ దిశగా బీజేపీ చర్యలు చేపట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి నేతలను చేర్పించుకుంటే టీడీపీలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా బీజేపీలోకి వైసీపీ నేతలను చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో జనసేనలో చేరికల బాధ్యతలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అప్పగించారు. ఇప్పుడు కోస్తాంధ్రలో బీజేపీలో చేరికల బాధ్యతలను సీఎం రమేష్ చూస్తున్నారు. దీంతో భారీగా వైసీపీ నుంచి జంపింగ్‌లు ఉంటాయన్న ప్రచారం క్షేత్రస్థాయిలో జరుగుతోంది.

Also Read : టాక్సిక్ వర్సెస్ స్పిరిట్.. బాక్సాఫీస్ వద్ద వైల్డ్ విధ్వంసం..!

ఎంపీ సీఎం రమేష్ అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అత్యంత దగ్గరగా ఉండే నేత. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో విపరీతమైన ప్రభావం చూపారు. ఉత్తరాంధ్రలో కూటమి గెలిచేందుకు అవసరమైన వనరులను కూడా ఆయనే సమకూర్చారు. అందుకే ఈసారి బీజేపీ ఆకర్ష భారీగా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల నుంచి వైసీపీ కీలక నేతల చేరికలు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రమేష్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారని.. వైసీపీ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారన్న టాక్ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రచారం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.. మరి బీజేపీ వైపు అడుగులు వేసే వైసీపీ నేతలు ఎవరో.. ఏం జరుగుతుందో చూడాలి మరి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

కవిత కొత్త పార్టీకి...

కల్వకుంట్ల కవిత ఇటీవలే ప్రతిపాదించిన నూతన...

రివేంజ్ ట్రాన్స్‌ఫర్స్.. నిజమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పరిపాలనాపరమైన...

లోకేష్ మార్క్ మ్యాజిక్.....

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి...

పోల్స్