అమెరికా-ఇరాన్ శాంతి చర్చలను ఇజ్రాయెల్ గౌరవించాలని, తమకున్న ఏకైక శక్తివంతమైన మిత్రదేశాన్ని విమర్శించడం సరికాదంటూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కు ప్రపంచంలో కేవలం అమెరికా మాత్రమే మిత్రదేశం కాదని, అంతకుమించిన బలమైన అంతర్జాతీయ మిత్రులు ఉన్నారని స్పష్టం చేశారు. అందులో ముఖ్యంగా భారత్ పేరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనా..?
భారత్ నుండి ఇజ్రాయెల్ కు అసాధారణమైన మద్దతు లభిస్తోందని నెతన్యాహు కొనియాడారు. “మాకు భారత్ లాంటి కొన్ని ఇతర దేశాలు కూడా మంచి స్నేహితులు. 140 కోట్ల జనాభా ఉన్న ఆ దేశం నుండి మాకు అపారమైన మద్దతు ఉంది. నా ఫేస్బుక్ ఖాతా తెరిస్తే చాలు.. భారతీయుల నుండి వస్తున్న మద్దతు వరదలా కనిపిస్తుంది” అంటూ నెతన్యాహు సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో, అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయెల్ పై ఎంత విమర్శలు వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందంటూ ఆయన ఉదహరించారు.
Also Read : టాక్సిక్ వర్సెస్ స్పిరిట్.. బాక్సాఫీస్ వద్ద వైల్డ్ విధ్వంసం..!
ప్రపంచ దేశాలు తమతో సంబంధాల కోసం ఎంతగా తహతహలాడుతున్నాయో కూడా నెతన్యాహు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రపంచంలోనే సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉందని, తమ టెక్నాలజీ అత్యంత అధునాతనమైనదని ఆయన చెప్పారు. ఎంతోమంది ప్రపంచ దేశాల నేతలు తనకు స్వయంగా ఫోన్ చేసి.. బహిరంగంగా తమకున్న రాజకీయ ఇబ్బందుల వల్ల బయటకు చెప్పలేకపోయినా, అంతర్గతంగా ఇజ్రాయెల్ సైనిక వ్యూహాలు, ఏఐ టెక్నాలజీ, సైబర్ నైపుణ్యాలను తమకు నేర్పించాలని కోరుతున్నట్లు నెతన్యాహు స్పష్టం చేశారు.

