Monday, July 6, 2026 03:46 PM
Monday, July 6, 2026 03:46 PM

నా దగ్గర ఏనుగు దంతాలున్నాయి: మోహన్ లాల్ సంచలనం..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్ వన్యప్రాణి సంబంధిత వస్తువుల కలిగి ఉన్న వ్యవహారంలో ఒక కీలక ప్రకటన చేశారు. తన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు, అలాగే ఏనుగు దంతాలతో తయారు చేసిన 13 విగ్రహాలు భద్రంగా ఉన్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. తన వద్ద ఉన్న ఈ అత్యంత విలువైపైన వస్తువులన్నీ అక్రమంగా సంపాదించినవి కావని, అవన్నీ తమకు వారసత్వంగా సంక్రమించినవి, వివిధ సందర్భాల్లో ఇతరుల నుండి బహుమతులుగా వచ్చినవేనని మోహన్‌ లాల్ స్పష్టం చేశారు.

Also Read : టాక్సిక్ వర్సెస్ స్పిరిట్.. బాక్సాఫీస్ వద్ద వైల్డ్ విధ్వంసం..!

గతంలో మోహన్‌ లాల్ ఇళ్లపై జరిగిన దాడుల్లో ఈ ఏనుగు దంతాలు లభించడంతో ఆయన వన్యప్రాణి రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని, అక్రమంగా వీటిని కలిగి ఉన్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన గత కొన్నేళ్లుగా అటవీశాఖ మరియు కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ వివాదానికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేరళ అటవీశాఖ తీసుకొచ్చిన ప్రత్యేక క్షమాభిక్ష పథకంను మోహన్‌లాల్ వాడుకున్నారు.

Also Read : మేడం సైలెన్స్.. కారణాలేమిటీ..?

కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఈ వన్యప్రాణి వస్తువుల క్షమాభిక్ష పథకం నిబంధనల ప్రకారమే మోహన్‌లాల్ తన వద్ద ఉన్న దంతాల వివరాలను అటవీశాఖకు లిఖితపూర్వకంగా సమర్పించారు. చట్టపరమైన ఇబ్బందుల నుండి పూర్తిగా బయటపడటానికే ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటిని డిక్లేర్ చేయడంతో, ఆయనపై ఉన్న అక్రమ నిల్వల ఆరోపణలకు గట్టి సమాధానం దొరికినట్లయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

కవిత కొత్త పార్టీకి...

కల్వకుంట్ల కవిత ఇటీవలే ప్రతిపాదించిన నూతన...

రివేంజ్ ట్రాన్స్‌ఫర్స్.. నిజమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పరిపాలనాపరమైన...

లోకేష్ మార్క్ మ్యాజిక్.....

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి...

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం...

ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను కేంద్ర...

పోల్స్