Saturday, October 10, 2026 09:55 AM
Saturday, October 10, 2026 09:55 AM

సాయికృష్ణ మృతి కేసులో సంచలన మలుపు..!

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ షీటర్ సాయికృష్ణ మృతి కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న నాగరాజును విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది. నిందితుడిని ఎనిమిది రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్న నాగరాజును ఈ నెల 10వ తేదీ వరకు అక్కడే విచారించాలని కోర్టు స్పష్టం చేసింది.

Also Read : ఆ విషయంలో మోదీ సైలెన్స్.. కాంగ్రెస్ ఫైర్..!

ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని పోలీసులకు గడువు విధించింది. ఈ విచారణ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరగాలని కోర్టు ఆదేశించింది. నిందితుడి న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని, దానికి సంబంధించిన ఆడియో మరియు వీడియోలను పూర్తిగా రికార్డ్ చేయాలని సూచించింది. విచారణ పూర్తయిన తర్వాత ఆ రికార్డులన్నింటినీ భద్రపరిచి కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.

Also Read : భవిష్యత్ ఏపీ కోసం బాబు భారీ ప్రణాళిక..!

ఈ 8 రోజుల కస్టడీ విచారణ పోలీసులకు అత్యంత కీలకంగా మారింది. సాయికృష్ణ మృతి వెనుక ఉన్న అసలు కారణాలు, ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా అనే కోణంలో పోలీసులు నాగరాజును ప్రశ్నించనున్నారు. ఈ విచారణ ముగిసిన తర్వాత పోలీసులు సమర్పించే నివేదిక ఆధారంగా ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో మరిన్ని అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాగరాజుతో పాటుగా నలుగురి పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్