Thursday, July 2, 2026 11:34 AM
Thursday, July 2, 2026 11:34 AM

శాసిస్తున్న వైసీపీ మాజీ మంత్రి..!

పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా.. ఆయన పదవిలో ఉన్నా లేకున్నా.. ఆయన మాటే శాసనం.. ఆయన చెప్పిందే వేదం.. ఆయన చేసిందే చట్టం.. ఇదే ఆ జిల్లాలో జరుగుతున్న తీరు. అధికారంలో లేకున్నా కూడా.. అధికారులను వైసీపీ మాజీ మంత్రి శాసిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పేరు ఎత్తేందుకు కూడా అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భయపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలను అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు. అక్రమ కేసులు పెట్టించారు. పోలీసులతో కొట్టించారు. ఇవన్నీ రహస్యంగా జరిగినవేవి కావు. బాహాటంగానే చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Also Read : నాని అవుట్.. రోహిత్ ఇన్..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి పేరు చెబితే.. ఆయనే నియంత.. ఆయనే కలెక్టర్.. ఆయనే ఎస్పీ.. ఆయనే ఇంఛార్జ్ మంత్రి.. ఆయనే జెడ్పీ ఛైర్మన్.. ఇలా అన్నీ ఆయనే అంటారు. ఇది ఈ రోజు కొత్తగా జరుగుతున్న వ్యవహారం కాదు. చాలా ఏళ్లుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాను పెద్దిరెడ్డి శాసిస్తున్నారనేది వాస్తవం. అధికారంలో ఉన్నా.. లేకున్నా కూడా.. ఆయనే సర్వం. ఆయన చెప్పిందే జిల్లాలో జరుగుతుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరిని అడిగినా సరే.. ఇదే మాట చెప్తారు. చంద్రబాబు కంటే కూడా.. పెద్దిరెడ్డి అంటేనే భయపడుతారు. ఇంకా చెప్పాలంటే.. పెద్దిరెడ్డికి సరెండర్ అవ్వడమే మేలని భావించే వాళ్లు కూడా ఉన్నారు.

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. జిల్లాలో కేవలం ఇద్దరే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ రెండు కూడా పెద్దిరెడ్డి బ్రదర్స్ గెలిచినవే. అయితే ఇప్పటికీ పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ మాజీ మంత్రి మాటే అధికారులు వింటున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కొంత మంది మాత్రం పెద్దిరెడ్డికి చంద్రబాబు పరోక్ష మద్దతు కూడా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి ఆర్థికంగా బాగా బలపడ్డారనే ప్రచారం వినిపిస్తోంది. వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అధికారుల అండతో సొంతం చేసుకున్నా కూడా.. ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు లేవు.

పెద్దిరెడ్డి బినామీలకు వందలాది ఎకరాల భూములను కట్టబెట్టిన ఐఏఎస్ అధికారినే తిరుపతి కలెక్టర్‌గా చంద్రబాబు నియమించటంతో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పరోక్షంగా చంద్రబాబు మద్దతు ఉందంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. పుంగనూరు నియోజకవర్గంలో కూటమి నాయకులకు అన్యాయం జరుగుతోందని జనసేన నేతలు కూడా ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టారని కూడా జనసేన నాయకుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల కాంట్రాక్టులు నిలిపివేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ అధికార యంత్రాంగం వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాటే వింటోందనే విమర్శలు వస్తున్నాయి.

Also Read : నేను అక్కడ నుంచి పోటీ చేయను.. లారెన్స్ క్లారిటీ..!

ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని టీడీపీ, జనసేన కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. భూముల వివాదాల్లో న్యాయం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూటమి నాయకులకు అన్యాయం జరుగుతోందని జనసేన నేతలు మొత్తుకుంటున్నారు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు ఎదుర్కున్నామనేది జనసేన నాయకుల ఆవేదన. అభివృద్ధి పనుల కాంట్రాక్టులు నిలిపి వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీఎంఓ‌లోకి మరో జగన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వైసీపీ అభిమాన...

తమిళ రాజకీయాల్లో సంచలనం.....

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ...

ఏపీ పెట్రోల్ బంకులపై...

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో అవినీతిని అంతమొందించేందుకు,...

నాని అవుట్.. రోహిత్...

ఏపీలో ఎన్నికలు ఇంకా మూడేళ్ల సమయం...

సునీల్ కుమార్ రిటైర్మెంట్...

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌ కు చెందిన వివాదాస్పద,...

దువ్వాడ మిస్సింగ్.. దివ్వెల...

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్...

పోల్స్