ఏపీని డిజిటల్ రంగంలో నంబర్ వన్‌గా నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తో సీఎం చంద్రబాబు అమరావతిలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ విప్లవాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్లే అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఉండే సామాన్యుడికి సైతం అత్యుత్తమ ఇంటర్నెట్, మొబైల్ కనెక్టివిటీని అందించడమే ఈ భేటీ ప్రధాన ఎజెండాగా సాగింది.
Also Read : కాషాయ పార్టీ స్పెషల్ ఫోకస్.. టార్గెట్ ఫిక్స్..!
ప్రతి ఇంటికీ హై-స్పీడ్ నెట్‌వర్క్ చేరేలా లాస్ట్ మైల్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడం, సిగ్నల్ సమస్యలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా కొత్త మొబైల్ టవర్లను భారీగా విస్తరించడంపై ఇరువురి మధ్య కీలక అవగాహన కుదిరింది. ఈ సమావేశంలో కేవలం కనెక్టివిటీ మాత్రమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును మార్చే భారీ ప్రాజెక్టులపై సమాలోచనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో అత్యాధునిక డేటా సెంటర్ల ఏర్పాటు, వాటిలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, అంతర్జాతీయ కనెక్టివిటీ కోసం సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ను రాష్ట్రంలో నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
Also Read : సింగపూర్ లో ఏపీ బంగినపల్లి సందడి..!
టెలికాం మరియు ఐటీ సేవల సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి అత్యంత అనుకూలమైన వ్యాపార వాతావరణాన్నితమ ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ సాకారమే ధ్యేయంగా జరిగిన ఈ చర్చలు అత్యంత విజయవంతమయ్యాయని, త్వరలోనే రాష్ట్రంలో ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.

