Friday, June 26, 2026 02:29 PM
Friday, June 26, 2026 02:29 PM

సంచలన నిర్ణయం దిశగా లోకేష్ అడుగులు..!

ఏపీ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. అమరావతిలో పాఠశాల విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు పాఠశాలలను వీడి, ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో లక్షకు పైగా విద్యార్థులు ప్రైవేట్ నుండి ప్రభుత్వ బడుల్లో చేరడం విశేషం.

Also Read : ముగ్గురు సీఎంల చారిత్రాత్మక భేటీ.. తుంగభద్ర వేదికగా సరికొత్త రాజకీయం..!

ముఖ్యంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గరిష్ట సామర్థ్యానికి చేరుకున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ప్రభుత్వ బడుల్లో కేవలం అడ్మిషన్లు పెరగడమే సరిపోదని, విద్యార్థుల క్రమశిక్షణ, హాజరు శాతం కూడా అంతే ముఖ్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల హాజరుతో పాటు వారి అభ్యసన ఫలితాలపై ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి చదువులో రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Also Read : నేను హిందువునే.. జేడి వాన్స్ భార్య సంచలనం..!

ఇదే సమయంలో మరో సంచలన నిర్ణయం దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. మధ్యతరగతి, పేద తల్లిదండ్రులకు ఊరటనిచ్చేలా మంత్రి లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న అధిక ఫీజుల నియంత్రణపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా త్వరలోనే స్పష్టమైన విధానాన్ని తీసుకురానున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. సాంకేతికతను విద్యార్థులకు మరింత చేరువ చేస్తూ డిజిటల్ విద్యా విధానంలో ఏపీ ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. రాబోయే ఉపాధ్యాయ దినోత్సవం నుండి 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ఏఐ ట్యూటర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా విద్యార్థులు క్లిష్టమైన సబ్జెక్టులను కూడా సులువుగా, సరికొత్త పద్ధతిలో నేర్చుకునే అవకాశం లభిస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ ఇద్దరు హెడ్...

విజయవాడలో పెను సంచలనం సృష్టించిన గాదె...

సింగిల్‌గా పోరాడుతున్న జనసేనాని..!

"నేనొక్కడినే మాట్లాడాలా..? మీ గొంతులు ఎందుకు...

నదుల అనుసంధానంతో భారత్...

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్...

పాస్‌పోర్ట్ జాతీయత కాదా..?...

భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక...

తిరుపతిలో భూమన భారీ...

వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ...

ముగ్గురు సీఎంల చారిత్రాత్మక...

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ...

పోల్స్