Friday, June 26, 2026 01:45 PM
Friday, June 26, 2026 01:45 PM

సింగిల్‌గా పోరాడుతున్న జనసేనాని..!

“నేనొక్కడినే మాట్లాడాలా..? మీ గొంతులు ఎందుకు వినిపించవు..?” అంటూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఆవేశంలో వచ్చిన మాటలు కావు. పార్టీ అంతర్గత పరిస్థితులపై ఆయనలో పేరుకుపోయిన అసంతృప్తికి అవి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. రాజకీయంగా కీలకమైన అంశాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నా, జనసేన తరఫున సమన్వయంతో కూడిన స్పందన కనిపించకపోవడమే పవన్ అసహనానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన ఒక కీలక శక్తిగా ఎదిగింది. అసెంబ్లీలోనూ, పార్లమెంట్‌లోనూ ప్రాతినిధ్యం ఉంది. ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలు, ప్రత్యర్థుల విమర్శలకు తిప్పికొట్టగల కేడర్ కూడా ఉంది. అయినప్పటికీ వివాదాస్పద అంశాలు తెరపైకి వచ్చినప్పుడు పార్టీ తరఫున వినిపించాల్సిన గట్టి స్వరం మాత్రం ఎక్కువగా పవన్ కళ్యాణ్ వరకే పరిమితమవుతోంది. దీంతో “జనసేనలో రాజకీయ స్పందన అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరేనా?” అన్న ప్రశ్న సహజంగానే వినిపిస్తోంది.

Also Read : సూర్యవంశీ.. టీమిండియా టూర్‌ లో ఊహించని ట్విస్ట్..!

సాయికృష్ణ వ్యవహారం దీనికి తాజా ఉదాహరణగా నిలిచింది. ఒకవైపు తీవ్రమైన ఆరోపణలు, మరోవైపు కుల సమీకరణాలతో కూడిన రాజకీయ ప్రచారం.. ఈ రెండు అంశాలు కలవడంతో జనసేన నాయకులు ఎలా స్పందించాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. నిందితుడికి మద్దతుగా మాట్లాడితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. అదే సమయంలో ప్రత్యర్థులు సృష్టించిన రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తే మరో రకమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో చాలామంది నేతలు.. మనకెందుకు వచ్చిందనేలా వ్యవహరిస్తే.. మరికొందరు మాత్రం వేచి చూసే ధోరణిని ఎంచుకున్నారు.

అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించి “నేరస్థులకు కులం, మతం ఉండవు” అని స్పష్టం చేసిన తర్వాతే పార్టీ శ్రేణులు చురుకుగా మాట్లాడటం ప్రారంభించాయి. ఈ పరిణామం ఒక విషయాన్ని స్పష్టంగా చూపించింది. జనసేనలో ఇంకా నిర్ణయాలు, స్పందనలు, రాజకీయ దిశ ఎక్కువగా అధినేత చుట్టూ తిరుగుతున్నాయి. స్థానిక నాయకత్వానికి స్వతంత్రంగా స్పందించే ధైర్యం, దానికి అవసరమైన వ్యవస్థ రెండూ పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్న అభిప్రాయం బలపడుతోంది. రాజకీయాల్లో తొలి స్పందనే చాలా సందర్భాల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రత్యర్థి పార్టీ ఒక ఆరోపణ చేసిన వెంటనే దానికి కౌంటర్ ఇవ్వకపోతే, ఆ కథనం ప్రజల్లో బలపడిపోతుంది. ప్రస్తుతం జనసేన ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా ఇదే. పవన్ కళ్యాణ్ మాట్లాడే వరకు నాయకులు ఎదురుచూడటం వల్ల ప్రత్యర్థులకు కథనాన్ని తమకు అనుకూలంగా మలచుకునే అవకాశం లభిస్తోంది.

Also Read : పాస్‌పోర్ట్ జాతీయత కాదా..? చట్టం ఏం చెప్తుంది..?

రాజకీయ పార్టీ విజయానికి నాయకుడి కరిజ్మా ఎంత ముఖ్యమో, బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. ఏ అంశంపై పార్టీ వైఖరి ఏమిటి..? ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలి..? ప్రత్యర్థుల విమర్శలకు ఎలా బదులివ్వాలి..? అనే విషయాల్లో క్షేత్రస్థాయి నాయకుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరికీ స్పష్టత ఉండాలి. టీడీపీ, వైసీపీలు ఈ విషయంలో ముందుంటాయి. ఏ అంశం వచ్చినా గంటల వ్యవధిలోనే పార్టీ లైన్ కింది స్థాయి వరకు చేరుతుంది. ఫలితంగా ప్రతి నేత ఒకే స్వరంతో మాట్లాడతారు.

అయితే జనసేనలో ఇంకా అలాంటి వ్యవస్థ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అధినేత ఏమనుకుంటున్నారు..? పార్టీ అధికారిక వైఖరి ఏమిటి..? అనే విషయాల్లో స్పష్టత లేకపోవడంతో చాలామంది నేతలు మౌనం వహిస్తున్నారు. తాము మాట్లాడిన మాట పార్టీ లైన్‌కు భిన్నంగా ఉంటే నష్టం జరుగుతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే చాలాసార్లు స్పందించడం కంటే సైలెంట్‌గా ఉండటమే బెటర్ అని భావిస్తున్నారు.

ఇప్పుడు జనసేనకు అత్యవసరంగా అవసరమైంది ఒక బలమైన రాజకీయ – మీడియా కమాండ్ సెంటర్. ప్రతి అంశంపై వెంటనే స్పందించే వ్యవస్థ, నేతలకు టాకింగ్ పాయింట్స్ అందించే మెకానిజం, సోషల్ మీడియా నుంచి టీవీ డిబేట్ల వరకు ఒకే సందేశాన్ని తీసుకెళ్లే సమన్వయ బృందం ఉండాలి. అధినేత ప్రతి అంశంలో స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా పార్టీ యంత్రాంగమే స్పందించే స్థాయికి చేరాలి.

Also Read : తిరుపతిలో భూమన భారీ భూబాగోతాలు..!

ఎందుకంటే రాజకీయంగా ఎదుగుతున్న పార్టీకి “బలమైన నాయకుడు” మాత్రమే సరిపోడు. “మాట్లాడే నాయకత్వం” కూడా కావాలి. పవన్ కళ్యాణ్ ఒక్కరి గొంతు జనసేనను అధికారంలోకి తీసుకురాగలదు. కానీ ఆ అధికారాన్ని రాజకీయంగా నిలబెట్టేది మాత్రం వందలాది గొంతులు కలిసి పలికే ఒకే స్వరం. ఆ స్వరం జనసేనలో ఎంత త్వరగా బలపడితే, భవిష్యత్తులో పార్టీ అంత బలంగా నిలబడే అవకాశం ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ ఇద్దరు హెడ్...

విజయవాడలో పెను సంచలనం సృష్టించిన గాదె...

సంచలన నిర్ణయం దిశగా...

ఏపీ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల దిశగా...

నదుల అనుసంధానంతో భారత్...

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్...

పాస్‌పోర్ట్ జాతీయత కాదా..?...

భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక...

తిరుపతిలో భూమన భారీ...

వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ...

ముగ్గురు సీఎంల చారిత్రాత్మక...

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ...

పోల్స్